సెంచూరియన్ మైదానంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా సీనియర్ ఆటగాడు రాహుల్ ద్రావిడ్, వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా రికార్డును బ్రేక్ చేశాడు. బ్రియాన్ లారాకు చెందిన టెస్టుల్లో 11,953 పరుగుల రికార్డును రాహుల్ ద్రావిడ్ అధిగమించి, అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ల జాబితాలో మూడో ఆటగాడిగా నిలిచాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి రోజైన గురువారం రాహుల్ ద్రావిడ్ కేవలం 11 పరుగులే చేయగలిగాడు. ఈ 11 పరుగుల ద్వారా 148 టెస్టు మ్యాచ్లు ఆడిన ద్రావిడ్ 11,957 పరుగులతో బ్రియాన్ లారా రికార్డును అధిగమించాడు.