1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. 7 held for stripping couples naked, sexually assaulting, filming them post-girivalam in Tiruvannamalai

తిరువణ్ణామలై గిరిప్రదక్షిణలో మహిళను నగ్నంగా చేసి లైంగికదాడి...

victim woman
తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలైలో గిరి ప్రదక్షిణ మార్గంలో దారుణం జరిగింది. మే నె 31వ తేదీ పౌర్ణమి రోజున గిరిప్రదక్షిణకు వెళ్లిన తిరువణ్ణామలై (అరుణాచలం) గిరి ప్రదక్షిణబాటలో దారుణాలు చోటుచేసుకున్నాయి. తన స్నేహితురాలితో కలిసి గిరిప్రదక్షిణ చేస్తున్న ఓ మహిళపై ఓ ముఠా సామూహిక అత్యాచారానికి పాల్పడగా పోలీసులు ఎనిమిది మందిని అరెస్టుచేశారు. వీరిలో ఓ మైనర్ బాలుడు కూడా ఉన్నాడు. 
 
స్థానిక పోలీసుల కథనం మేరకు.. గతనెల 31వ తేదీ రాత్రి తిరువణ్ణామలై మున్సిపాలిటీ ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల యువతి గిరి ప్రదక్షిణ చేస్తుండగా కాళ్లనొప్పులు రావడంతో ఆడిఅన్నామలై గ్రామం వద్ద కూర్చుని స్నేహితుడిని రమ్మని పిలిచింది. అనంతరం ఇద్దరూ అక్కడికి దగ్గరులోని హోటల్లో టిఫిన్ పార్సిల్ చేసుకుని అయ్యంపాలయం బైపాస్ రోడ్డు వద్దకు వెళ్లారు. 
 
అక్కడ ఒక ముఠా వారిని బెదిరించి అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి చిత్రహింసలు పెట్టి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇద్దరినీ నగ్నంగా వీడియో తీసి, యువతి చెవికి ఉన్న రెండు గ్రాముల బంగారు కమ్మలు లాక్కుని విడిచిపెట్టారు. ఈ ఘటనపై స్థానిక పడమర పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. మొత్తం 11 మంది ఉన్నారని గుర్తించారు.
 
అలాగే, మరో ఘటనలో ధర్మపురికి చెందిన ఒక వివాహిత తన స్నేహితులతో కలిసి తిరువణ్ణామలై పౌర్ణమి రోజున గిరిప్రదక్షిణకు వచ్చారు. రు. ఆ రోజు రాత్రి గిరిప్రదక్షిణ పూర్తిచేసుకుని ద్విచక్ర వాహనాల్లో వారు బయలుదేరారు. కొందరు ముందు వెళ్లిపోగా దారిలో పెద్దకోలాపాడి వద్ద వివాహిత, మరో స్నేహితుడు వాహనం ఆపి మాట్లాడుతుండగా మారణాయుధాలతో వచ్చిన ఒక ముఠా వారిని బెదిరించి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లింది. వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
 
అనంతరం వారి దుస్తులు లాక్కొని ఇద్దరినీ నగ్నంగా వీడియో తీశారు. మర్నాడు ఆ వీడియోను వివాహితకు పంపి రూ.లక్ష డిమాండ్ చేశారు. లేదంటే వీడియోను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. ఆమె రూ.4 వేలు పంపి ధర్మపురి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరువణ్ణామలై పడమర పోలీసులు వివాహిత నుంచి వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
కర్నాటక ప్రజలపై సీఎం డీకే శివకుమార్ వరాల జల్లు