నీ భర్తతో కన్నపిల్లల్ని నా దగ్గర వద్దన్న ప్రియుడు, ఆత్మహత్య చేసుకున్న వివాహిత
మందమర్రి పట్టణంలోని విద్యానగర్ లో విషాద ఘటన చోటుచేసుకున్నది. తను నివాసం వుంటున్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. బెల్లంపల్లి మండలం సోమగూడెంకి చెందిన పావనికి ఆరేళ్ల క్రితం సతీష్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా వున్నారు. ఐతే భర్తతో తరచూ గొడవలు రావడంతో భర్తను విడిచిపెట్టి పిల్లల్ని తీసుకుని తల్లివద్ద వుంటోంది.
పావని విషయం తెలిసిన ఆమె క్లాస్‌మేట్ సంగ్రామ్ సింగ్ చింతించాడు. 24 ఏళ్ల వయసులోనే నీకు ఇన్ని కష్టాలు వచ్చాయా అంటూ విచారం వ్యక్తం చేసాడు. అడపాదడపా ఆమె వద్దకు వచ్చి పరామర్శలు చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య కాస్త సన్నిహిత సంబంధం ఏర్పడింది. దాంతో సంగ్రామ్ సింగ్, తనను పెళ్లి చేసుకోవాలంటూ ప్రపోజ్ చేసాడు. తన మంచి కోరుకునే వ్యక్తిని వివాహం చేసుకోవాలని పావని కూడా నిర్ణయించుకున్నది. ఈ క్రమంలో సంగ్రాం సింగుతో కలిసి పావని వేరే ఇంట్లో వుంటోంది.
ఇద్దరు పిల్లలు తల్లి వద్ద వుంటున్నారు. గత 15 రోజులుగా సంగ్రాం సింగ్-పావని కలిసి ఒకే ఇంట్లో నివాసం వుంటుండగా, తల్లి పావనికి కబురు పెట్టింది. నీ పిల్లల్ని నీవే తీసుకుని వెళ్లంటూ చెప్పింది. విషయం తెలిసిన సంగ్రాం సింగ్... నీ మాజీ భర్తతో కన్నపిల్లల్ని నావద్దకు ఎలా తెస్తావు, కుదరదు అని చెప్పేసాడు. దీనితో అటు తల్లి ఒత్తిడి, ఇటు ప్రియుడు నిరాకరణ చేయడంతో ఎటూపాలుపోని పావని ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. పావని తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.