తిరుపతిలో దారుణం, వేసవి శెలవులకు వచ్చిన 16 ఏళ్ల బాలికపై బాబాయ్ అత్యాచారం
తిరుపతిలో దారుణ ఘటన జరిగింది. వేసవి శెలవులకు పిన్ని, బాబాయిల ఇంటికి వచ్చిన ఆ బాలికపై అఘాయిత్యం జరిగింది. ఆమె ఏమరుపాటుగా వున్నప్పుడు బాలిక వ్యక్తిగత ఫోటోలు తీసాడు కామాంధుడిగా మారిన బాబాయి. తండ్రి స్థానంలో వున్న అతడు కామపిశాచిగా మారాడు. బాలికకు సంబంధించి వ్యక్తిగత ఫోటోలు చూపించి వాటిని సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.
తిరిగి హైదరాబాద్ వచ్చిన కుమార్తె మానసిక స్థితిని గమనించిన తల్లి బాలిక వద్ద ఏం జరిగిందంటూ అనునయించి అడిగింది. దీనితో విషయం చెప్పి బోరుమని కన్నీటిపర్యంతమైంది. కుమార్తెపై అఘాయిత్యం చేసిన కామాంధుడిపై జగద్గిరిగుట్ట పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయగా వారు కేసును తిరుపతి ఈస్ట్ పోలీసు స్టేషనుకు బదిలీ చేసారు. నిందితుడిపై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
