1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Bengaluru woman smothers 13-year-old daughter, then dies by suicide: cops

కన్నకుమార్తెను కిరాతకంగా హత్య చేసిన కన్నతల్లి

bangalore woman - daughter
ఐటీ నగరం బెంగుళూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కన్నకూతురిని కన్నతల్లే అతి కిరాతకంగా హత్య చేసింది. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. వైట్‌ఫీల్డ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇమ్మెడిహళ్లిలో మంగళవారం ఉదయం ఈ హృదయ విదాకర ఘటన వెలుగులోకి వచ్చింది. మృతులను సువర్ణ (40), ఆమె కుమార్తె కారుణ్య (14)గా గుర్తించారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... సువర్ణ భర్త చంద్రశేఖర్ ఆఫీసుకు వెళ్లారు. ఆ తర్వాత ఆయన భార్యకు పలుమార్లు ఫోన్లు చేసినా ఆమె స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చి సమీపంలో ఉన్న తన  సోదరుడిని ఇంటికి వెల్లి చూడాలని కోరాడు. దీంతో ఉదయం 11 గంటలక సమయంలో ఇంటికి వెళ్లి చూడగా, గదిలో కారుణ్య విగతజీవిగా పడివుండగా, సువర్ణ మాత్రం ఫ్యానుకు ఉరేసుకుని కనిపించింది. 
 
దీనిపై సమాచారం అందుకున్న వైట్‌ఫీల్డ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి రలించారు. కుమార్తెను ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. ఆ తర్వాత సువర్ణ ఆత్మహత్య చేసుకునివుండొచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. 
 
అయితే, ఆర్థిక సమస్యల కారణంగా సువర్ణ తీవ్రమైన మనోవేదనకు గురై ఈ దారుణానికి పాల్పడివుండొచ్చని ఆమె సోదరి ఉష సందేహం వ్యక్తం చేశారు. సిటీ ఖర్చులు పెరిగిపోతున్నాయని, కుటుంబాన్ని నడపడం కష్టంగా ఉందని సువర్ణ తనతో పదేపదే చెప్పేదని ఉష తెలిపారు. 
 
ఈ ఘటనపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. తన కుమార్తెను భార్యే హత్య చేసిందని భర్త చంద్రశేఖర్ ఫిర్యాదు చేయగా, సువర్ణ మృతిపై ఆమె సోదరుడు మంజునాథ్ పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. దీంతో పోలీసులు రెండు కోణాల్లో విచారణ జరుపుతున్నారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
180 మంది బాలికలపై లైంగికదాడి... 350కి పైగా అశ్లీల వీడియోలు.. బీజేపీ ఎంపీ ఫిర్యాదు