సోమవారం, 9 మార్చి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 2 మార్చి 2026 (13:48 IST)

డ్రగ్స్ మత్తులో 9 యేళ్ళ బాలిక గొంతు కోసి చంపేసిన యువకుడు

crime news
బీహార్ రాష్ట్రంలో సభ్య సమాజం తలదించుకునే సంఘటన ఒకటి జరిగింది. తన డ్రగ్స్ అలవాటు గురించి ఇంట్లో ఫిర్యాదు చేస్తానన్న తొమ్మిదేళ్ళ బాలికను అత్యంత కిరాతకంగా ఓ యువకుడు హత్య చేశాడు. ఈ దారుణానికి పాల్పడింది 13 యేళ్ళ మైనర్ బాలుడు కావడం గమనార్హం. మత్తుకు బానిసైన ఆ యువకుడు ఆ బాలికను గొంతు కోసం అతి కిరాతకంగా చంపేశాడు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. 13 యేళ్ళ బాలుడు కొంతకాలంగా గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటుపడ్డాడు. ఇదే గ్రామానికి చెందిన 9 యేళ్ళ బాలిక ఈ విషయాన్ని గమనించి బాలుడు తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో బాలుడుని మందలించడంతో చిన్నారిపై ఆ బాలుపుడ పగ పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఆ బాలిక ఒంటరిగా కనిపించడంతో ఇదే అదనుగా భావించి పదునైన ఆయుధంతో ఆమె గొంతుకోసి అక్కడ నుంచి పరారయ్యాడు. 
 
రక్తపు మడుగులో నిర్జీవంగా పడివున్న తన కుమార్తెను చూసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు... మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా కోసం ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడుని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మైనర్ కావడంతో జువైనల్ హోమ్‌కు తరలించి విచారణ జరుపుతున్నారు.