1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Bihar Man Comes to Meet Married Lover, Her Family Beats Him to Death

బీహార్‌లో దారుణం... వివాహిత ఇంటికెళ్లిన యువకుడిని కొట్టి చంపేసిన కుటుంబ సభ్యులు

murder
బీహార్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. వివాహిత ఇంటికి వెళ్లిన ఓ యువకుడుని ఆ మహిళ కుటుంబ సభ్యులు కొట్టి చంపేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని తూర్పు చంపారన్ జిల్లా మోతిహారికి చెందిన బాదల్ సింగ్ (23) అనే యువకుడికి గోపాల్ గంజ్ జిల్లాకు చెందిన కాజల్ కుమారి అనే వివాహితతో కొంతకాలంగా ప్రేమ వ్యవహారం సాగుతోంది. భర్తతో విభేదాల కారణంగా కాజల్ కుమారి ప్రస్తుతం తన పుట్టింట్లో ఉంటోంది. ఈ క్రమంలో శనివారం రాత్రి బాదల్ సింగ్ ఆమెను కలిసేందుకు మాఝ్వులియా గ్రామంలో ఆమె ఇంటికి వెళ్లాడు. 
 
అర్థరాత్రి సమయంలో బాదల్‌ను గమనించిన కుటుంబ సభ్యులు అతడిని పట్టుకుని చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన బాదల్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, బాదల్ అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలం నుంచి ఆధారాలు సేకరించింది. ఈ కేసుకు సంబంధించి కాజల్ కుమారిని, ఆమె తల్లిని అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. ఈ ఘటనతో సంబంధం మరికొందరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 
 
టీ పేరుతో మద్యం తాగించి అత్యాచారం... స్నేహితుడే నమ్మించి కాటేశాడు... 
 
హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన ఇబ్రహీంపట్నంలో ఓ దారుణం జరిగింది. బీటెక్ విద్యార్థిని అత్యాచారానికి గురైంది. స్నేహితుడే నమ్మించి కాటేశాడు. టీ తాగుదామని పిలిచి.. మద్యం తాగించి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తేరుకున్న ఆ బాధితురాలు తనపై అత్యాచారం జరిగినట్టు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
పోలీసుల కథనం మేరకు.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌‍కు చెందిన ఉడుతల విజయ్ అనే యువకుడు ఇబ్రహీంపట్నంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. తనతో పాటు చదువుతున్న ఓ యువతితో విజయ్‍‌కు మంచి స్నేహం ఉంది. ఈ నెల 14వ తేదీన టీ తాగుదామని ఆ యువతిని తన కారులో ఎక్కించుకుని దిల్‌సుఖ్ నగర్‌కు తీసుకెళ్లాడు. 
 
తిరిగి వస్తున్న సమయంలో మార్గమధ్యంలో మద్యం కొనుగోలు చేసి, ఆ తర్వాత ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బలవంతంగా మద్యం తాగించాడు. ఆమె మత్తులోకి జారుకున్న తర్వాత తన గదికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. మరుసటి రోజు ఉదయం స్పృహలోకి వచ్చిన ఆ యువతి తనపై అత్యాచారం జరిగినట్టు గుర్తించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. విజయ్‌ను అరెస్టు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
టీ పేరుతో మద్యం తాగించి అత్యాచారం... స్నేహితుడే నమ్మించి కాటేశాడు...