సంబంధిత వార్తలు
- ప్రతికూల వాతావరణం.. హైదరాబాద్‌కు రావాల్సిన తొమ్మిది విమానాల దారి మళ్లింపు
- తడా హైవేలో అగ్ని ప్రమాదం.. పూర్తిగా కాలిపోయిన ప్రైవేట్ బస్సు.. ఏమైంది?
- Sajjanar: వర్క్ ఫ్రమ్ బైక్.. పెట్రోల్ ట్యాంక్‌పై ల్యాప్‌టాప్ ఉంచి వాహనం నడుపుతూ.. (video)
- సినీ ఫక్కీలో రియల్ లైఫ్ జరిగింది.. విడాకులు పేపర్లు చించేసి భర్తను హత్తుకుంది.. (video)
- రాష్ట్రంలో ఎవరైనా రాజకీయాలు చేసే స్వేచ్ఛ ఉంది.. పవన్‌కు కూడా అదే వర్తిస్తుంది.. రేవంత్ రెడ్డి
బీహార్ రాబరీ గర్ల్స్, నగల దుకాణంలో యజమాని కళ్లలో పెప్పర్ స్ప్రే కొట్టి దోపిడీ యత్నం, వీడియో
ఇ
దివరకు మగవారే దోపిడీ చేయడాన్ని చూసేవాళ్లం. కానీ ఇప్పుడు మహిళలు... అందులో మరీ యువతులు దొంగతనాలకు పాల్పడటం కనబడుతోంది. బీహారు రాష్ట్రంలోని పాట్నాలో ఇలాంటి ఘటన చోటుచేసుకున్నది. పాట్నాలోని దిఘా ప్రాంతం కుర్జీ బ్రిడ్జి వద్ద వున్న ఒక బంగారు నగల దుకాణంలోకి ఆభరణాలు కొంటామని షాపులోకి వచ్చారు. కొద్దిసేపు కొంటున్నట్లు నాటకమాడారు. ఆ తర్వాత యజమాని కాస్త పక్కకి జరగగానే అతడిపై పెప్పర్ స్ప్రే ఉపయోగించారు.
కానీ వాళ్ల ప్లాన్ బెడిసికొట్టింది. పెప్పర్ స్ప్రే కొట్టగానే షాపు యజమాని చిందులు తొక్కుతూ కేకలు వేస్తూ గందరగోళం చేస్తూ తలుపులు తీసి పొరుగు షాపుల వారిని అప్రమత్తం చేసాడు. షాపు యజమాని అలా గావు కేకలు పెడుతూ చిందులు తొక్కేసరికి పాపం రాబరీ గర్ల్స్ బిక్కచచ్చిపోయారు. దొరికిపోయారు. పారిపోవడానికి ప్రయత్నించిన ఆ ఇద్దరు అమ్మాయిలను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గోల్డ్ షాప్‌లోకి చొరబడి.. పెప్పర్ స్ప్రే కొట్టి..!
— ChotaNews App (@ChotaNewsApp) June 13, 2026
బీహార్ పాట్నాలోని దిఘా ప్రాంతం కుర్జీ బ్రిడ్జి వద్ద ఉన్న ఒక నగల దుకాణంలో ఇద్దరు అమ్మాయిలు దోపిడీకి ప్రయత్నించారు. దుకాణ యజమానిని అచేతనుడిని చేసేందుకు వారు పెప్పర్ స్ప్రే ఉపయోగించారు. అయితే, యజమాని చాకచక్యంగా బయటకు వచ్చి కేకలు… pic.twitter.com/SHm8scY1wM
