బ్రేకప్ చెప్పిందని ఆఫీసులోనే నిట్టనిలువునా కత్తితో పొడిచి చంపేసిన ప్రియుడు, వీడియో
ఘోరాతి ఘోరంగా ఓ యువతిని కత్తితో పొడిచి హత్య చేసాడు ఆమె మాజీ ప్రియుడు. అందరూ చూస్తుండగానే కార్యాలయంలోకి చొరబడి ఆమెపై దాడి చేసాడు. ఎంత వారించినా రాక్షసుడిలా మారిన అతడు అత్యంత క్రూరంగా ఆమెను హతమార్చాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
పంజాబ్ రాష్ట్రంలోని మొహాలీలో 30 ఏళ్ల డింపుల్, 39 ఏళ్ల హర్జిందర్ సింగ్ గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఐతే ఇటీవల ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో యువతి అతడికి బ్రేకప్ చెప్పింది. దానితో ప్రియురాలిపై విపరీతమైన ఆగ్రహం పెంచుకున్నాడు. అదనుకోసం ఎదురుచూసిన అతడు ఆమె ఆఫీసుకు రాగానే ఒక్కసారిగా కత్తి తీసుకుని ఆమెపై దాడి చేయడం మొదలుపెట్టాడు.
ఆమె తప్పించుకునే ప్రయత్నం చేసినా వెంబడించి మరీ పొడిచాడు. తోటి ఉద్యోగులు అతడిని ఆపేందుకు ప్రయత్నించినా వారిని కత్తితో బెదిరించాడు. చివరికి ఆమెపై విచక్షణారహితంగా కత్తితో పొడిచి హత్య చేసాడు. సిసి కెమేరాల్లో ఆ దృశ్యాలన్నీ రికార్డయ్యాయి.
సీసీటీవీ ఫుటేజ్..!
— Telugu Scribe (@TeluguScribe) June 5, 2026
బ్రేకప్ చెప్పిందని ఆఫీసులోనే యువతిని దారుణంగా చంపిన ప్రియుడు
పంజాబ్ - మొహాలీలో ఒకే కంపెనీలో పనిచేస్తూ మూడేళ్లుగా ప్రేమలో ఉన్న డింపుల్(30), హర్జిందర్ సింగ్(39)
అయితే ఇటీవల యువతి బ్రేకప్ చెప్పడంతో ఆఫీసులోనే వెంటపడి కత్తితో దాడి చేసి చంపేసిన ప్రియుడు… pic.twitter.com/4dX6QNubRo
