సంబంధిత వార్తలు
- కాశీలో రేణూ దేశాయ్.. ఎందుకో తెలుసా?
- బాత్రూమ్ వీడియోలతో బ్లాక్ మెయిల్ -షార్ట్ ఫిల్మ్ నటి అమూల్య ఆత్మహత్య
- చివరి శ్వాస వరకు చేయి వీడొద్దని మాటిచ్చుకున్నాం... : భర్తకు పూర్ణ ఎమోషనల్ పోస్ట్
- 'మీరే నా సర్వస్వం..' - భారతీరాజా మృతిపై నటి రాధిక ఎమోషనల్ పోస్ట్
- లక్షలకు లక్షలు పారితోషికం తీసుకున్న వరలక్ష్మి ప్రమోషన్‌కు డుమ్మా కొట్టారు.. (Video)
'ఆకాశంలో ఒక తార' హీరోయిన్ స్నేహితురాలిపై అత్యాచారం
హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్‌లో దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ సినీ నటి అత్యాచారానికి గురైంది. ఆ నటికి ఇవ్వాల్సిన పారితోషికం ఇవ్వకుండా వేధింపులకు గురిచేసిన క్యాస్టింగ్ డైరెక్టర్.. ఆ నటిని కారులో బంధించి లైంగికదాడికి పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి 'ఆకాశంలో ఒక తార' అనే చిత్రంలో హీరోయిన్‌కు చెల్లి పాత్రను పోషించిన నటి కావడం గమనార్హం.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. 'ఆకాశంలో ఒక తార' అనే చిత్రంలో హీరోయిన్ స్నేహితురాలి పాత్రను ఇప్పిస్తానని క్యాస్టింగ్ డైరెక్టర్ ప్రసాద్ బాధితురాలిని సంప్రదించాడు. ఒప్పందం ప్రకారం 2025 అక్టోబరు నుంచి డిసెంబరు వరకు షూటింగులో పాల్గొన్నప్పటికీ ఆమెకు ఇవ్వాల్సిన రూ.90 వేలు రెమ్యునరేషన్‌తో పాటు ప్రయాణ ఖర్చులు రూ.38 వేలు చెల్లించకుండా వేధింపులకు గురిచేశాడు.
ఈ క్రమలో గత ఫిబ్రవరిలో డబ్బులు ఇస్తానని నమ్మించి బంజారాహిల్స్‌కు పిలిపించాడు. అక్కడకు వెళ్లిన నటిని బలవంతంగా కారులోకి ఎక్కించి, డోర్లు లాక్ చేసి అసభ్యంగా ప్రవర్తించాడు. తనకు లొంగిపోతేనే ఇండస్ట్రీలో మరిన్ని అవకాశాలు ఇప్పిస్తానని, లేదంటే కెరీర్ నాశనం చేస్తానని బెదిరించినట్టు తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయాన్ని బాధితురాలి తల్లి ప్రశ్నించగా, ఆమెను కూడా ఫోనులో దుర్భాషలాడినట్టు తెలిపారు.
దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు మోసం, లైంగిక వేధింపులు, క్రిమినల్ బెదిరింపుల కింద కేసు నమోదు చేసినట్టు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండగా, అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
