1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Chennai crime news in Telugu, Visuals on a pen drive showing an industrialist satisfying his desires with a girl

పెన్ డ్రైవ్‌లో బాలికతో పారిశ్రామికవేత్త లైంగిక కోర్కెలు తీర్చుకుంటున్న దృశ్యాలు

victim woman
ఆయన పేరమోసిన పారిశ్రామికవేత్త. డబ్బుతో బాలికలను వలలో వేసుకుని వారితో లైంగిక కోర్కెలు తీర్చుకుంటున్న దారుణ ఘటన చెన్నైలో వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
 
చెన్నై నగరానికి చెందిన ఓ సామాజిక కార్యకర్త గత అక్టోబరు నెలలో చెన్నై వ్యభిచార నియంత్రణ విభాగం పోలీసు అధికారిని కలిసి ఫిర్యాదు చేసారు. గుర్తు తెలియని వ్యక్తి తనకు ఓ పెన్ డ్రైవ్ ఇచ్చారనీ, అందులో ప్రముఖ పారిశ్రామికవేత్త వీరమణి ఓ బాలికతో లైంగిక కోర్కెలు తీర్చుకుంటూ వున్న దృశ్యాలు వున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
 
రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చెన్నైలోని తేనాంపేటలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఆ ఇంటిలో ఈ బాగోతం నడుపుతున్నట్లు తేలింది. డబ్బుకి ఆశ చూపి పలువురు బాలికలను లొంగదీసుకుని వ్యభిచారం చేయిస్తున్నట్లు కనుగొన్నారు. ఈ ఇంటిలో వుంటున్న శాంతి ఆమె భర్త మహేంద్రను పోలీసులు అరెస్ట్ చేసారు. పోలీసుల తనిఖీల్లో కొందరు బాలికలు, మహిళల ఫోటోలు కనిపించాయి. దీనితో బాధితులను గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
About Writer
ఐ వెెంకట్
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలలో పనిచేసారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
తిరుపతి: కొండను ఢీకొన్న లారీ.. అగ్నికి ఆహుతి.. డ్రైవర్‌కు ఏమైందంటే?