సంబంధిత వార్తలు
- ఏలూరులో దారుణం.. ఇద్దరు వృద్ధ మహిళల సజీవదహనం
- సిలిండర్ ధరను పెంచిన ఆయిల్ కంపెనీలు.. ఎంత పెంచారంటే...
- గుజరాత్లో దారుణం : ఇద్దరు మైనర్ బాలికలు గర్భం - చోద్యం చూసిన తల్లి
- పెళ్లికి నిరాకరించిన మహిళ - బాలుడిని నేలకేసి కొట్టి చంపేసిన కిరాతకుడు
- Kiran Abbavaram : ఛాట్ బస్టర్స్ గా దూసుకెళ్తున్న చెన్నై లవ్ స్టోరీ మూవీ
గుర్రపు స్వారీ పేరుతో బాలికకు లైంగిక వేధింపులు
చెన్నైలోని మెరీనా బీచ్‌లో గుర్రపు స్వారీ పేరుతో ఓ మైనర్ బాలికను లైంగికంగా వేధించిన ఓ మైనర్ బాలుడిని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై పోలీసులు వెల్లడించిన వివరాల మేరకరు.. చెన్నై సమీపంలోని తాంబరంకు చెందిన దంపతులు శనివారం రాత్రి చెన్నై మెరీనా బీచ్‌కు తమ ఆరేళ్ల కుమార్తెను తీసుకొచ్చారు. ఆ బాలిక గుర్రపు చేస్తానని అడగడంతో బీచ్‌లో ఉన్న గుర్రపు స్వారీ చేయించే బాలుడితో తమ కుమార్తెను కొంచెం దూరం తీసుకెళ్లాలని కోరారు.
దీంతో ఆ బాలికను గుర్రంపై కూర్చోబెట్టుకుని చీకటి ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లాడు. దీన్ని గమనించిన బాలిక తల్లిదండ్రులు అంతదూరం ఎందుకు తీసుకెళ్లావని ప్రశ్నించారు. ఆ తర్వాత తమ కుమార్తెను ప్రశ్నించగా, ఆ బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ జరిపి 16 యేళ్ల బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు.
'కాక్రోచ్ జనతా పార్టీ' ట్విట్టర్ ఖాతా బ్లాక్ ... ఎందుకో తెలుసా?
సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ ఖాతాను భారత్‌లో నిలిపివేశారు. అనధికారిక పొలిటికల్ క్యాంపెయిన్‌ను ప్రారంభించిన వారం రోజుల్లోనే తమ ఎక్స్ ఖాతాను నిలిపివేశారని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తెలిపారు.
ఎక్స్ ఖాతా నిలిపివేసే సమయానికి ఆ ఖాతాకు దాదాపు రెండు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. మరోవైపు, కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే సీజేపీకి చెందిన ఇన్‌స్టా ఖాతాను 14 మిలియన్ల మందికి పైగా ఫాలో అవుతుండటం గమనార్హం. సీజేపీ పేరిట వెబ్‌సైట్ కూడా ప్రారంభించారు.
కొంత మంది యువకులను బొద్దింకలతో పోల్చుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యల నేపథ్యంలోనే సటైరికల్‌గా కాక్రోచ్ జనతా పార్టీ అనే వేదిక పుట్టుకొచ్చింది.
ఈ ఆన్‌లైన్ క్యాంపెయిన్‌ను అభిజీత్ దీప్కే అనే యువకుడు ప్రారంభించారు. అమెరికాలో బోస్టన్ యూనివర్సిటీలో ఇటీవలే పబ్లిక్ రిలేషన్స్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. ఈ పార్టీలో చేరేందుకు కావాల్సిన అర్హతలు, మేనిఫెస్టో, విజన్‌ను తమ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
తర్వాతి కథనం
