గురువారం, 19 ఫిబ్రవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 13 డిశెంబరు 2025 (15:30 IST)

పొరుగింటి పిల్లాడితో గొడవపడుతున్న కొడుకు.. తలను రోడ్డుకేసి కొట్టిన సవతి తండ్రి...

murder
హైదరాబాద్ నగరంలోని చాంద్రాయణగుట్టలో దారుణం జరిగింది. పక్కింటి పిల్లలతో తరచూ గొడవపడుతున్నాడనే కోపంతో తమ పదేళ్ళ కుమారుడిని సవతి తండ్రి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. బాలుడి తలను రోడ్డుకేసి బాదంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... చాంద్రాయణగుట్టకు చెందిన ఓ మహిళకు గతంలో వివాహమైంది భర్తతో విభేదాల కారణంగా విడాకులు తీసుకుని అదేప్రాంతానికి చెందిన మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే, ఆమె మొదటి భర్త సంతానమైన షేక్ అహ్మద్ అజహర్ (10)కూడా వారితోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో అజహర్ తరచూ ఇరుగుపొరుగు పిల్లలతో గొడవపడుతుండేవాడు. ఈ విషయంపై స్థానికులు బాలుడి సవతి తండ్రిని పలుమార్లు నిలదీశారు. 
 
ఈ క్రమలోనే ఈ నెల 7వ తేదీన తీవ్ర ఆగ్రహానికి గురైన నిందితుడు.. బాలుడు తలను పట్టుకుని రోడ్డుకేసి బలంగా కొట్టాడు. ఈ ఘటనలో బాలుడి తలకు తీవ్ర గాయాలైన అజహర్‌ను కుటుంబ సభ్యులు గాంధీ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడైన సవతి తండ్రిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.