1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Daughter Hired Contract Killers To Stage Jaipur Woman's Road Accident; Seven Held

కారుణ్య ఉద్యోగం కోసం కన్నతల్లినే చంపేసిన కుమార్తె... ఎక్కడ?

neeraj sharma
తండ్రి మరణానంతరం ఇచ్చే కారుణ్య ఉద్యోగం కోసం ఓ కుమార్తె ఏకంగా కన్నతల్లిని హతమార్చింది. తండ్రి ఉద్యోగంతో పాటు ఆస్తి మొత్తం తనకే దక్కాలన్న దుర్బుద్ధితో ఆ యువతి ఈ దారుణానికి పాల్పడింది. రాజస్థాన్ రాష్ట్రంలోని ప్రతాప్ నగర్‌లో వెలుగు చూసిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, 
 
పోలీసుల కథనం మేరకు... ప్రతాప్‌ నగర్‌లో ఈ నెల 23వ తేదీన రవీంద్రనగర్‌కు చెందిన నీరజ్‌ శర్మ(45) అనే మహిళ కారు ఢీకొనడంతో మృతి చెందింది. ఈ ప్రమాదంపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆమె సోదరుడు రాకేశ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యేడాది క్రితం భర్త మరణించగా కారుణ్య నియామకం కింద కోర్టులో ఎల్‌డీసీగా నీరజ్‌ శర్మ ఉద్యోగం పొందారు. 
 
ఆ ఉద్యోగం తనకు దక్కాలని కుమార్తె ఆయుషి శర్మ ఆశించింది. తల్లి ఒప్పుకోకపోవడంతో ఆగ్రహించింది. దీంతో పాటు కుటుంబ ఆస్తిని కూడా దక్కించుకునేందుకు తమ సమీప బంధువులు ఆరుగురితో కలిసి కుట్రపన్నింది. దర్యాప్తులో కుట్రను ఛేదించిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నారని డీసీపీ రంజిత్‌ శర్మ వెల్లడించారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్ మృతి...