సంబంధిత వార్తలు
- పింఛన్ డబ్బు కోసం తండ్రిని హత్య చేసిన కొడుకు, కూతురుకి మరణ శిక్ష
- ప్రియుడి కోసం అడ్డుగా వుందని కన్నబిడ్డను కడతేర్చిన తల్లి
- పిల్లనిచ్చిన అత్త ప్రేమలో పడిన అల్లుడు, లేచిపోయి పెళ్లి చేసుకున్నారు, వీడియో
- లంచం ఇవ్వలేదన్న కోపంతో అతికిన ఎముకలు విరగ్గొట్టిన వైద్యుడు.. ఎక్కడ?
- చనిపోయిన తండ్రి కోర్కె తీర్చడం కోసం సిగరెట్ దమ్ము కొట్టి నైవేద్యం పెట్టిన కుమార్తె, వీడియో
పెళ్లైనా మరో యువకుడితో కుమార్తె: శ్రీకాకుళం తీసుకెళ్లి చంపేసిన తల్లి, తాతయ్య, వీడియో
శ్రీకాకుళం టెక్కలి మండలం సొర్లిగాం గ్రామంలో విషాదం చోటుచేసుకున్నది. ఇప్పటికే పెళ్లయి నాలుగేళ్ల బాబు వున్నప్పటికీ వేరే వ్యక్తిని పెళ్లాడుతానంటూ మొండికేసిన కుమార్తెను కన్నతల్లి కడతేర్చింది. పరువు పోతుందన్న కారణంతో ఆమెను హైదరాబాదు నుంచి పిలుచుని వెళ్లి మరీ హత్య చేసింది ఆ తల్లి. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. దుంపల హరిణికి డిగ్రీ చదువుతున్న సమయంలో తన మేనమామ దంతేశ్వర రావుతో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమారుడు వున్నాడు. భర్త శ్రీకాకుళం జిల్లాలోనే సచివాలయ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
ఐతే డిగ్రీ పూర్తి చేసిన హరిణి గ్రూప్స్ శిక్షణకు తల్లిదండ్రులతో కలిసి హైదరాబాదు వెళ్లింది కానీ ఇంట్లో తన స్టడీపైన దృష్టి పెట్టలేకపోవడంతో ఓ హాస్టల్లో వుండి చదువుకోవాలనుకుంది. ఇలా చదువుకుంటున్న సమయంలోనే స్టడీ సెంటర్లో ఆమెకి నాగేంద్ర అనే యువకుడు పరిచయమయ్యాడు. అది కాస్త వారిమధ్య ప్రేమకు దారితీసింది. ఐతే కుమార్తె ప్రవర్తనలో మార్పు రావడం గమనించిన తల్లి ఆమెను గట్టిగా నిలదీసింది.
దీనితో హరిణి... తను నాగేంద్రను పెళ్లి చేసుకుంటానని తల్లికి చెప్పడమే కాకుండా బాలానగర్ పోలీసు స్టేషనులో కూడా ఫిర్యాదు చేసింది. తన భర్త నుంచి విడాకులు కావాలని కూడా కోరింది. ఇదంతా తెలుసుకున్న తల్లి, ఆమె తాతయ్యలు హరిణి సమస్యను పరిష్కరిస్తామని శ్రీకాకుళం తీసుకుని వెళ్లారు. భర్తతో విడాకులు ఇప్పిస్తామని ఇంటికి తీసుకుని వచ్చారు. మే నెల 31 అర్థరాత్రి హరిణి మంచంపై నిద్రపోతుండగా ఆమె కాళ్లను తల్లి గట్టిగా పట్టుకోగా, తాతయ్య ఇనుప రాడ్డుతో గట్టిగా మోది చంపేసాడు.
అనంతరం తమ కుమార్తెకి గుండెపోటుతో చనిపోయిందని చెప్పి అర్థరాత్రి వేళ మృతదేహాన్ని శ్మశానానికి తరలించి దహనం కూడా చేసారు. ఇక తాము పోలీసులకు దొరకబోమని అనుకున్నారు కానీ హరిణి పంపిన ఓ వీడియో వాళ్లను పూర్తిగా పట్టించేసింది. దీనితో తల్లిని, హరిణి భర్తను, తాతయ్యను అరెస్ట్ చేసారు.
శ్రీకాకుళంలో కూతురిని చంపిన కన్నతల్లి, భర్త..!
— BIG TV Breaking News (@bigtvtelugu) June 11, 2026
శ్రీకాకుళం జిల్లా సొర్లిగాంలో జరిగిన ఓ దారుణ పరువు హత్య శక్తి యాప్ వల్ల వెలుగుచూసింది. గ్రూప్-1 శిక్షణ పొందుతున్న దుంపల హరిణి (24), భర్తకు విడాకులిచ్చి మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంది. దీనికి కక్ష పెంచుకున్న కన్నతల్లి, భర్త,… pic.twitter.com/iCXxFFOW4s
హరిణి వీడియోలో ఏం చెప్పింది...
నన్ను ఇంట్లో లాక్ చేసారు. నేను పుట్టి పెరిగింది హైదరాబాదులోనే. సెటిల్మెంట్ అని చెప్పి శ్రీకాకుళం తీసుకొచ్చారు. మే నెలలో నాపై భౌతిక దాడి చేసారు. చివరిసారిగా నేను వెళ్తున్నా, నేను రాకపోతే నాకు హెల్ప్ చేయండి. ఒకవేళ నా ఫోన్ స్విచాఫ్ అయినా... జూన్ 5 లోపుగా నేను రాకపోతే ఏదో జరగరానిది జరిగినట్లేనని పరిగణించండి అంటూ పోలీసులకు తెలుపుతూ వీడియో పంపింది. ఇదే కీలక ఆధారంగా మారింది.
