సంబంధిత వార్తలు
- ప్రేమజంటను బెదిరించి బాలికపై సామూహిక అత్యాచారం...
- భార్య మరొకరితో వెళ్లిపోయిందనీ ఇద్దరు పిల్లలను కడతేర్చి ఆత్మహత్య చేసుకున్న భర్త
- బీజేపీ చిత్తుగా ఓడిపోతుంది... 200కు పైగా సీట్లలో గెలుస్తాం : మమతా బెనర్జీ
- ట్రంప్‌కి ఏమైంది? ఇరాన్ పని ముగించాక క్యూబా హస్తగతం చేసుకుంటాము: ట్రంప్ సంచలన ప్రకటన
- అమెరికాతో మళ్లీ యుద్ధం జరగొచ్చు : ఇరాన్ సైనిక కార్యాలయం
ఢిల్లీలో ఇంట్లో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్న జడ్జి
ఢిల్లీలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ జ్యూడీషియల్ సర్వీసెస్‌కు చెందిన 30 యేళ్ల యువ న్యాయాధికారి అమన్ కుమార్ శర్మ అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. ఆయన తన నివాసంలోనే ఉరేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు జరిపిన విచారణలో న్యాయాధికారిది ఆత్మహత్యగా భావిస్తున్నారు.
జడ్జి అమన్ కుమార్ శర్మ ఆత్మహత్య విషయాన్ని శనివారం మధ్యాహ్నం 1.45 గంటల సమయంలో అమన్ బావమరిది శివమ్, పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాత్రూం తలుపులు పగలగొట్టి చూడగా అమల్ కుమార్ శర్మ ఉరి వేసుకుని కనిపించారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు.
కుటుంబ కలహాలు కారణంగానే అమన్ తీవ్ర మనోవేదనకు గురై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆయన తండ్రి ఇతర బంధువులు పోలీసుల వద్ద ఆరోపించినట్టు సమాచారం. అయితే, సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లంభించలేదని పోలీసులు తెలిపారు.
అమన్ కుమార్ శర్మ 2021లో ఢిల్లీ జ్యూడీషియల్ సర్వీసెస్‌లో చేరారు. ప్రస్తుతం కర్కర్దుమా కోర్టులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరిగా పని చేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన భార్య కూడా జడ్జి కావడం గమనార్హం. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, ఇపుడే ఏమీ చెప్పలేమని ఓ సీనియర్ పోలీస్ అధికారి వివరించారు.
