భార్య, అత్తను కత్తితో నరికి చంపేసిన వ్యక్తి...
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్య, అత్తను కత్తితో నరికి చంపేశాడు. వెస్ట్ గోదావరి జిల్లాలోని సీతానగరం మండలం బొబ్బిలంకలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. మృతులను లత, లక్ష్మిగా గుర్తించారు.
స్తానిక పోలీసులు వెల్లడించిన సమాచారం మేరకు.. సోడదాసి సీతారామరాజు, లత ప్రేమ వివాహం చేసుకున్నారు. గత కొంతకాలంగా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. లత తల్లి కూడా వారితోనే ఉంటోంది.
ఈ నేపథ్యంలో సోమవారం అర్థరాత్రి అత్తగారింటికి వెళ్లిన సీతారామరాజు... లత, లక్ష్మిలను కిరాతకంగా నరికి చంపాడు. భార్యపై అనుమానమే ఈ ఘటనకు కారణమని పోలీసులు తెలిపారు. నిందితుడు గతంలోనూ ఓ హత్య కేసులో జైలుకెళ్లి వచ్చినట్లు చెప్పారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.