సంబంధిత వార్తలు
- జగన్.. గత చరిత్ర తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది... బీటెక్ రవి వార్నింగ్
- సూర్యాపేటలో బీఆర్ఎస్ నేత దారుణ హత్య
- పిల్లలను చూసేందుకు వచ్చిన భర్తను కొట్టి చంపేసిన భార్య
- వరంగల్ జంట హత్యల కేసు : ముద్దాయి మరణించేంత వరకు ఉరితీయండి.. కోర్టు తీర్పు
- Chiranjeevi: చిరంజీవి గారి సలహా స్పూర్తి,. బుచ్చిబాబు వల్ల చేతికి గాయం : రామ్ చరణ్
రెండోసారి కూతురే పుట్టిందని 10 నెలల పసికందును హతమార్చిన కన్నతండ్రి
ఢిల్లీలో దారుణం జరిగింది. తనకు రెండోసారి కూడా కుమార్తె జన్మించిందని 10 నెలల పసికందును అత్యంత దారుణంగా హత్య చేసాడు ఓ కసాయి తండ్రి. హత్య చేసింది కాక కిడ్నాప్ డ్రామా ఆడాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని ముకుంద్‌పూర్‌లో దీపక్ తన భార్యా ఇద్దరు బిడ్డలతో నివాసముంటున్నాడు. ఐతే అతడు తనకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టడంపై తీవ్రంగా మధనపడుతూ వచ్చాడు. ఈ క్రమంలో అతడు దారుణమైన పనికి పూనుకున్నాడు. తన భార్యకు, పెద్ద కుమార్తెకి మత్తు మందు ఇచ్చాడు.
వారు మత్తులోకి జారుకోగానే 10 నెలల పసికందును ఊపిరాడకుండా చేసి హత్య చేసాడు. ఆ తర్వాత మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంకులో పడేసి, తన కుమార్తెను ఎవరో కిడ్నాప్ చేసారంటూ ఉదయాన్నే భోరుమంటూ విలపించడం ప్రారంభించాడు. పోలీసులు దర్యాప్తు చేయగా షాకింగ్ వ్యవహారం బైటకు వచ్చింది.
అదేమిటంటే.. పసికందును కన్నతండ్రి దీపక్ హత్య చేసి ఆమె మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంకులో పడేసినట్లు సీసీ కెమేరాల్లో రికార్డయ్యింది. దీనితో అతడి నిజస్వరూపం బైటపడింది. కంటికి రెప్పలా కన్నవారిని చూసుకోవాల్సిన కన్నతండ్రి ఇలా కసాయిగా మారిన వైనాన్ని చూసి స్థానికులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. అతడిని కఠినాతి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
