మంగళవారం, 17 మార్చి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్

తండ్రికి ముగ్గురు భార్యలు - ఆత్మహత్య చేసుకున్న అక్కాచెల్లెళ్లు ముగ్గురూ తోడబుట్టిన వాళ్లే...

ghaziabad sisters
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో ఇటీవల ముగ్గురు అక్కా చెల్లెళ్లు భవనం తొమ్మిదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న కేసులో సరికొత్త విషయం వెలుగులోకి వచ్చింది. కొరియన్ ఆన్‌లైన్ గేమ్‌కు బానిసలైన ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్లు తమ టాస్క్‌లో భాగంగా బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. 
 
అయితే, ఈ కేసులో తాజాగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సదరు అక్కా చెల్లెళ్ళ కుటుంబం మొత్తం గందరగోళంగానే ఉన్నట్టు సమాచారం. మరణించిన బాలికల తండ్రితో అటాచ్‌మెంట్ ఎక్కువగా ఉందని వారి సూసైడ్ లేఖ వెల్లడిస్తోంది. వారి తండ్రికి ముగ్గురు భార్యలు ఉన్నారని, ఆ ముగ్గురూ సొంత అక్కా చెల్లెళ్లేనని తాజాగా వెలుగులోకి వచ్చింది.
 
ముగ్గురిని వివాహం చేసుకున్న సదరు తండ్రి, గతంలో ఓ మహిళతో లివిన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. రాజేంద్రనగర్‌లోని ఓ అపార్టుమెంట్‌లో ఆమెతో లివిన్‌లో ఉన్నట్టు తేలింది. 2015లో సదరు మహిళ అనుమానాస్పద రీతిలో బిల్డింగ్ పైనుంచి దూకి ప్రాణాలు తీసుకోగా, ఆత్మహత్యగా భావించి ఈ కేసును కొట్టేశామని డీసీపీ నిమిశ్ పాటిల్ తెలిపారు. 
 
బాలిక తండ్రి వ్యాపారంలో నష్టపోయాడని, రూ.2 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయని ఇప్పటికే తెలిసిందని చెప్పారు. కుటుంబ సంబంధాల్లో ఈ గందరగోళం కూడా బాలికల ఆత్మహత్యక కారణమై ఉండవచ్చనే కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నట్టు డీసీపీ వివరించారు.