శుక్రవారం, 13 మార్చి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 18 డిశెంబరు 2025 (14:58 IST)

అద్దె అడిగినందుకు ఇంటి యజమానిని కుక్కర్‌తో కొట్టి చంపేసిన దంపతులు

murder
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో ఓ దారుణం జరిగింది. ఇంటి అద్దె అడిగినందుకు ఓ ఇంటి యజమానిని దంపతులు కుక్కరుతో కొట్టి చంపేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని ఓ సూట్‌కేసులో కుక్కి బయటపడేసేందుకు తీసుకెళుతూ పోలీసుల చేతికి చిక్కారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఘజియాబాద్‌లోని మోదీ నగర్ ప్రాంతంలోని ఔరా చిమేరా రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో దీప్షికా శర్మ, ఉమేశ్ శర్మ దంపతులు నివాసం ఉంటున్నారు. ఇదే కాంప్లెక్స్‌లో వారికి మరో ఫ్లాట్ కూడా ఉంది. ఈ ఫ్లాట్‌ను అజయ్ గుప్తా, ఆకృతి గుప్తా దంపతులు అద్దెకు ఇచ్చారు.
 
అయితే, ఈ దంపతులు గత నాలుగు నెలలుగా అద్దె చెల్లించడం లేదు. ఈ బకాయిలను వసూలు చేసుకోవడానికి దీప్షికా శర్మ బుధవారం గుప్తా దంపతులు ఉంటే ఫ్లాట్‌కు వెళ్ళింది. ఆ తర్వాత దీప్షికా ఇంటికి తిరిగిరాలేదు. దీంతో దీప్షికా ఇంటి పనిమనిషి మీనా తన యజమానురాలిని వెతుక్కుంటూ గుప్తా దంపతులు ఫ్లాట్‌కు వెళ్లింది. అయితే దీప్షిక ఇంట్లో పని మనిషి మీనా తమ యజమానురాలిని వెతుక్కుంటూ గుప్తా దంపతుల ఫ్లాట్‌కు వెళ్లింది. అయితే, దీప్షిక తమ వద్దకు రాలేదని వారు చెప్పారు. వారి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో మీనా సీసీటీవీ ఫుటేజీని పరిశీలించింది. అందులో గుప్తా దంపతుల ఫ్లాట్‌లోకి దీప్షిక వెళ్లడం కనిపించిందేగానీ బయటకురాలేదు.
 
దీంతో మీనా పోలీసులకు సమాచారం అందించింది. ఇంతలో గుప్తా దంపతులు పెద్ద సూట్‌కేసులో మోసుకుంటూ బయటకు వెల్లేందుకు ప్రయత్నించారు. అప్పటికే వారిపై అనుమానం ఉన్న మీనా వెంటనే వారిని అడ్డుకుంది. తన యజమానురాలు కనిపించేవరకు ఎక్కడికీ వెళ్ళడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఇంతలో పోలీసులు అక్కడకు చేరుకుని గుప్తా దంపతుల ఫ్లాట్‍లో సోదాలు చేయగా, సూట్ కేసులో దీప్షికా మృతదేహం బయటపడింది. గుప్తా దంపతులను ప్రశ్నించగా, అద్దె విషయంలో గొడవపడటంతో ఆగ్రహం పట్టలేక కుక్కర్‍తో దీప్షిక తలపై కొట్టి, చున్నీతో ఉరివేసి చంపేసినట్టు నేరాన్ని అంగీకరించారు. దీంతో గుప్తా దంపతులను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.