బాలికకు గంజాయి తాగించి మత్తులో వుండగా రౌడీషీటర్లు అత్యాచారం
హైదరాబాదు నగరంలోని నార్సింగి పోలీసు స్టేషను పరిధిలో దారుణం జరిగింది. బాలికను కిడ్నాప్ చేసి ఆపై ఆమెకి గంజాయి తాగించారు ముగ్గురు రౌడీషీటర్లు. ఆమె మత్తులోకి జారుకోగానే ఆమెపై ముగ్గురూ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను అక్కడే వదిలేసి పరారయ్యారు. బాధితురాలికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి అత్యంత విషమంగా వున్నట్లు వైద్యులు తెలిపారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ప్రేమించిన యువతి తలపై సుత్తితో కొట్టిన యువకుడు
ఇటీవలి కాలంలో సైకోలు, కామాంధుల సంఖ్య రానురాను పెరుగుతోంది. రోజుకో దారుణం ఎక్కడో ఒకచోట వెలుగుచూస్తూనే వున్నది. గురువారం నాడు ఉదయం ఓ యువకుడు తను ప్రేమించిన యువతి తనను దూరంగా పెడుతోందన్న కక్షతో ఆమెపై సుత్తితో దాడి చేసాడు.
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. సూర్యాపేటలోని స్నేహనగరులో యువతి నివాసం వుంటోంది. ఆమె తనను ప్రేమించి ఇటీవల దూరం పెడుతోందన్న కారణంగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో అతడు లోపలికి దూరాడు. ఆమెతో గొడవపడి సుత్తితో ఆమె తలపై బలంగా కొట్టాడు. దాంతో యువతి అక్కడికక్కడే కూలబడిపోయింది. ఆమె పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం. కాగా యువతిపై దాడి చేసిన యువకుడిని స్థానికులు పట్టుకుని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేసారు. పోలీసులకు సమాచారం అందించారు.