సంబంధిత వార్తలు
- మహిళతో అక్రమ సంబంధం.. తండ్రీకొడుకుల జగడం.. కుమారుడి హత్య
- Dethadi: ఆశిష్ హీరోగా కల్చరల్ డ్రామా దేత్తడి సెకండ్ షూటింగ్ ప్రారంభం
- విడాకుల కోసం సొంత చెల్లినే ఎరగా వేసిన మహిళ ... భర్త రెండో భార్యగా చిత్రీకరించిన వైనం...
- ఏపీలో ఇంటర్ విద్యార్థులకు శుభవార్త చెప్పిన విద్యాశాఖ
- 20 గుంటల భూమి కోసం.. ఇద్దరు మైనర్ కుమారులకు విషం కలిపిన బిస్కెట్లు ఇచ్చిన తండ్రి.. ఎక్కడ?
రెండో భర్తను ఇద్దరు ప్రియులతో కలిసి హత్య చేసిన భార్య.. ఎక్కడ?
గుజరాత్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ మహిళ.. తన రెండో భర్తను ఇద్దరు ప్రియులతో కలిసి హత్య చేసింది. అనుమానాస్పద కేసుగా నమోదు చేసిన పోలీసుల విచారణలో కూపీ లాగగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ మహిళతో పాటు ఆమె ప్రియుడిని అరెస్టు చేయగా, పరారీలో ఉన్న మరో ప్రియుడి కోసం గాలిస్తున్నారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుజరాత్‌కు చెందిన జాగృతి అనే మహిళకు కొన్నేళ్ల క్రితం సుఖ్‌దేవ్ గిరి అనే వ్యక్తితో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ కొంతకాలానికి సుఖ్ దేవ్ గిరి సోదరుడు శాంతిగిరి గోస్వామితో ప్రేమలో పడింది. ఆ తర్వాత తన భర్త, పిల్లలను వదిలేసి అతనితో కలిసి వెళ్లిపోయింది. అక్కడే శాంతిగిరిని రెండో వివాహం చేసుకుంది. అక్కడితో ఆమె మోసం ఆగలేదు.
తన ఇంటి పక్కనే ఉన్న ట్రక్కు డ్రైవర్ కాంతిలాల్ అలియాస్ భరత్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. జాగృతి ఇంటిపక్కనే కాంతిలాల్ గది అద్దెకు తీసుకున్నాడు. వీరి బంధానికి రెండో భర్త అడ్డుగా ఉండటంతో.. ప్రియుడితో కలిసి శాంతిగిరిని చంపేందుకు ప్లాన్ వేసింది. ఇందుకోసం యూనస్ అనే వ్యక్తికి రూ.25 వేలు సుపారీ ఇచ్చింది.
దీంతో శాంతిగిరిని చంపేందుకు అతడి ఇంటికి వెళ్లిన యూనస్.. భయపడి అతడు నిద్రపోతున్న ఫొటో తీసి పంపి, హత్య చేశానంటూ జాగృతితో నమ్మబలికాడు. ఆ డబ్బులు తీసుకొని జారుకున్నాడు. తెల్లారి చూసేసరికి శాంతిగిరి బతికే ఉండటంతో ఆమె అవాక్కైంది. దీంతో మోసపోయానని గ్రహించిన జాగృతి, ప్రియుడు కాంతిలాల్‌తో కలిసి రెండో భర్తను ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. అనంతరం దాన్నొక ప్రమాదంగా చిత్రీకరించేందుకు దీపక్ అనే మరో వ్యక్తి సాయం తీసుకుంది.
దీపక్ కూడా ఈ మహిళ ప్రేమాయణం నడిపినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అతడు తీసుకొచ్చిన కారులో ముగ్గురూ వెళ్లి.. శాంతిగిరి మృతదేహాన్ని సురేంద్రనగర్ సమీపంలోని కాలువలో పడేశారు. తన భర్త గురించి చుట్టుపక్కలవారు అడిగితే.. కొత్త ఉద్యోగంలో చేరాడని, నంబర్ కూడా మార్చాడని జాగృతి చెప్తూ వచ్చింది.
మరోవైపు గతేడాది అక్టోబరులో శాంతిగిరి మృతదేహాన్ని కాలువలో గుర్తించిన పోలీసులు.. తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆ తర్వాత లోతుగా దర్యాప్తు చేపట్టగా అసలు నేరం వెలుగు చూసింది. దీంతో జాగృతి, కాంతిలాల్‌ను అరెస్టు చేయగా, వినోద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
