1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Hidden Cameras, 58 Women: Nashik Astrologer And His Farmhouse Of Secrets

58 మంది మహిళలపై లైంగిక దాడి.. మత్తు మందిచ్చి అత్యాచారం.. పెన్ డ్రైవ్ లభ్యం

crime
దొంగబాబాలు, జ్యోతిష్యులచే నేరాలు పెరుగుతున్నాయి. జ్యోతిష్యం, వాస్తు పేరిట.. 58మంది మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ జ్యోతిష్యుడు, రిటైర్డ్ మర్చంట్ నేవీ అధికారి అశోక్ ఖారట్ (67) అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
58 మంది మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన వీడియోలతో కూడిన పెన్‌డ్రైవ్ లభించడం కేసు తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ కేసు దర్యాప్తు కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. 
 
కెప్టెన్ అని పిలువబడే ఇతనిని 35 ఏళ్ల మహిళ 2022లో సంప్రదించింది. భర్తకు ప్రాణగండమని.. ప్రత్యేక పూజలతో నివారిస్తానని నమ్మించాడు. ఆపై మత్తుమందు ఇచ్చి.. ఆమెపై 2025 వరకు పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయంపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతడి ఫార్మ్ హౌస్‌పై దాడి చేసి  ఒక పిస్టల్, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతని కార్యాలయంలో రహస్యంగా అమర్చిన సీసీటీవీ కెమెరాలను గుర్తించారు. 
 
అక్కడ లభించిన ఒక పెన్‌డ్రైవ్‌లో 58 మంది వేర్వేరు మహిళలపై లైంగిక దాడి చేస్తున్న వీడియోలు ఉండటంతో పోలీసులు నిర్ఘాంతపోయారు. 
 
మత్తుమందులు, చేతబడి వంటివి ప్రయోగించి మహిళలను లొంగదీసుకుని, ఆ దృశ్యాలను రికార్డు చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. 
 
నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 64 (అత్యాచారం), బ్లాక్ మ్యాజిక్ చట్టం కింద కేసులు నమోదు చేసిన పోలీసులు, అతడిని కోర్టులో హాజరుపరచగా మార్చి 24 వరకు కస్టడీకి అప్పగించారు. సిట్ దర్యాప్తులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
తర్వాతి కథనం
ఆడబిడ్డ పుట్టిందని 15 రోజుల పసికందును విషమిచ్చి చంపేసిన తండ్రి.. ఎక్కడ?