సంబంధిత వార్తలు
- పీడ విరగడైంది, తాగుబోతు భర్త వేధింపులు తట్టుకోలేక చంపేసిన భార్య
- ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేసిన ముగ్గురు పిల్లల ప్రైవేట్ స్కూల్ టీచరమ్మ
- భార్యను లేపుకెళ్లిన వ్యక్తిని పోలీసు స్టేషను ఎదుటే నరికి చంపారు
- వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను లేపేసిన భార్య
- ఇదే సమయం, వచ్చేయ్: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
వంట చేయకపోతే విడాకులు కావాలా...? కుదరని తేల్చి చెప్పిన హైకోర్టు
భార్యాభర్త.. ఇద్దరూ ఉద్యోగులుగా ఉన్నపుడు, భార్య వంట చేయడం లేదన్న కోపంతో విడాకులు కోరిన భర్తకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. ఉద్యోగినిగా ఉన్న భార్య వంట చేయకపోవడం, తన కన్నతల్లి బాగోగులను చూసుకోకుండా సహకరించడం లేదన్న కారణాన్ని చూపి క్రూరత్వంగా పరిగణించి విడాకులు మంజూరు చేయాలని కోరడం కుదరదడని కోర్టు తేల్చి చెప్పింది.
పైగా, భార్య కారణంగా హింసకు గురవుతున్నానని, వివాహాన్ని రద్దు చేయాలంటూ హైదరాబాద్ ఎల్బీనగర్‌కు చెందిన ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను కింది కోర్టు కొట్టివేయడంతో హైకోర్టులో అప్పీలు దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ నగేశ్ భీమపాకలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి ఇటీవల తీర్పు వెలువరిస్తూ అప్పీలును కొట్టివేసింది.
భర్త మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 10 వరకు ఆఫీసు విధుల్లో ఉండగా, భార్య ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉద్యోగంలో ఉంటుందని, ఇలాంటప్పుడు ఉదయం వంట చేయలేదన్న కారణాన్ని క్రూరత్వంగా పరిగణించలేమంది. తనభార్య తరచూ పుట్టింటికి వెళుతోందని, తమతో కలిసి ఉండటంలేదన్న దానిపై వివాహమై ఏడాది 9 నెలలు కాగా, అందులో తనతో కలిసి ఉన్నది 5 నెలలని ఒకసారి, 3 నెలలని మరోసారి భిన్నంగా భర్త వాంగ్మూలం ఇచ్చారంది.
పెళ్లయిన తర్వాత గర్భస్రావం కావడంతో తల్లిదండ్రుల వద్ద ఉండటాన్ని క్రూరత్వంగా పరిగణించలేమంది. వేరు కాపురం పెట్టాలన్నది క్రూరత్వం కిందికి వస్తుందని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ.. అది ఆయా కేసుల్లోని వాస్తవాల ఆధారంగా వర్తిస్తుందని తెలిపింది. ప్రస్తుత కేసులో వేరుకాపురం ప్రతిపాదన భార్య చేయలేదని.. ఆమె తరపు న్యాయవాది అలా సలహా ఇచ్చారని, అందువల్ల దాన్ని క్రూరత్వంగా పరిగణించలేమంది. భర్త చేసిన ఆరోపణలను క్రూరత్వంగా పరిగణించి విడాకులు మంజూరు చేయలేమంటూ అప్పీలును కొట్టివేసింది.
