ఆదివారం, 18 జనవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 16 డిశెంబరు 2025 (14:19 IST)

కొత్తగా పెళ్లి చేసుకుని జడుగ్గాయిలా భర్త, అసలు ఇలాంటి వారికి పెళ్లెందుకు?

husband and wife
ఇటీవలి కాలంలో పెళ్లి చేసుకున్న తర్వాత పురుషులు ఎందుకూ కొరగాకుండా పోతున్నారు. తాళి కట్టి తీసుకెళ్లిన అమ్మాయిని కేవలం అంటే కేవలం ఇంటి పని మనిషి కంటే హీనంగా మార్చేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ముసుగులో అతడు ఓ గదికి పరిమితమైపోయి జడుగ్గాయిలా మారిపోతున్నారు. ఎంతసేపటికి పనిపై ధ్యాస తప్ప కొత్తగా పెళ్లి చేసుకుని ఎన్నో ఆశలతో తనతో వచ్చిన అమ్మాయిని అస్సలు పట్టించుకోవడంలేదు. పలుకరిస్తే చికాకు, సరసమాడితే వివాదం... ఇలా చీటికిమాటికి తగాదాలతో విసిగించడమే పనిగా పెట్టుకుంటున్నారు. దీనితో భర్త నిజస్వరూపం తెలుసుకుని గంపెడాశలతో వచ్చిన ఆ అమ్మాయిలు కాస్తా విపరీతమైన చర్యలకు పాల్పడుతున్నారు. అలాంటి చర్యల్లో కొందరు విడాకులు తీసుకుంటుంటే మరికొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇటువంటిదే ఒకటి జరిగింది.
 
ఏపీలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న భర్త తనతో మాట్లాడేందుకు సమయం కేటాయించకపోవడంతో మనస్తాపం చెందిన భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఏపీలోని వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగింది. ప్రొద్దుటూరుకు చెందిన చందనా జ్యోతి (25)కు కొత్తగూడెంకు చెందిన బి.వెంకటసాయి యశ్వంత్‌తో ఈ యేడాది ఆగస్టు 14వ తేదీన వివాహం జరిగింది. ప్రస్తుతం వీరిద్దరూ మూసాపేట పరిధిలోని ఆంజనేయ నగర్‌లో ఉంటున్నారు. చందనాజ్యోతి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, వర్క్ ఫ్రమ్ హోం చేస్తోంది. భర్త యశ్వంత్ మెడ్‌ప్లస్‌ సంస్థలో పనిచేస్తున్నాడు. 
 
చందనాజ్యోతి భర్త ఉదయం వెళ్ళి రాత్రికి ఇంటికి వస్తున్నాడు. అసలే కొత్తగా వివాహం కావడం, ఇంట్లోనే ఉండటంతో ఆమె మానసిక వేదనకు లోనైనట్టు తెలుస్తోంది. ఈ విషయంపై భర్తతో గత రెండు మూడు రోజులుగా ఆమె గొడవపడింది. శుక్రవారం ఈ దంపతులిద్దరూ చెరో గదిలో వేర్వేరుగా నిద్రపోయారు. శనివారం తెల్లవారుజామున యశ్వంత్ ఎంత పిలిచినా చందనాజ్యోతి స్పందించకపోవడంతో గది తలుపులు పగులగొట్టి చూడగా, ఆమె దుప్పటితో ఉరేసుకుని కనిపించింది. ఆ వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు.