1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Hyderabad Golconda Fateh Darwaza : a man named Masood was brutally murdered by his brothers-in-law

ప్రేమించి పెళ్లి చేసుకున్న చెల్లిని వేధిస్తున్నాడని బావను చంపేశారు...

murder
తెలంగాణ రాష్ట్రంలో తమ చెల్లిని వేధిస్తున్న బావను బామ్మర్ధులు చంపేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత తన చెల్లిని వేధించడాన్ని జీర్ణించుకోలేని బావమరుదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కుమ్మర్‌వాడీకి చెందిన షేక్‌ మెహబూబ్‌ (26) అలియాస్‌ గోల్కొండ చాందీ మసూద్‌ ఎలక్ట్రీషియన్‌తో పాటు యూట్యూబర్‌గా కొనసాగుతున్నాడు. 2025 జనవరిలో అదేప్రాంతానికి చెందిన రుక్సా(22)ను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. పెళ్లైన ఆరునెలల వరకు సంసారం సాఫీగా సాగింది. కొద్ది నెలలుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. 
 
సోమవారం రుక్సా సోదరుడు సొహేల్‌ ఆమెను పుట్టింటికి తీసుకెళ్లాడు. శుక్రవారం మధ్యాహ్నం సొహేల్‌ అతని కజిన్‌ జాబేర్‌తో కలిసి మెహబూబ్‌ ఇంట్లో ఉండగా అతని తలపై రాడ్‌తో దాడి చేసి కత్తితో పొడిచారు. దీంతో రక్తపు మడుగులో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిందితులిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
విమాన ప్రయాణం తర్వాత పొడిబారుతున్న చర్మం... ఎందుకో తెలుసా?