1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. hyderabad son in law attacks and kills mother in law with a helmet while riding a bike in medipally

చిన్న గొడవ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది... అత్త ప్రాణాలు తీసిన అల్లుడు

deadbody
హైదరాబాద్ నగరంలోని శివారు మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దారుణం జరిగింది. చిన్నపాటి గొడవ ఒకటి చిలికి చిలికి గాలివానలా తయారై ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చెంగిచెర్ల ఆర్టీసీ కాలనీకి చెందిన కొల్ల అరుణ అనే మహిళకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్న కుమార్తె కావ్య గత యేడాది కరీంనగర్‌‍కు చెందిన కర్రు స్నేహిత్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. అయితే, పెళ్లయినప్పటి నుంచి అల్లుడి ప్రవర్తన సరిగా లేదు. ఈ క్రమంలో అత్త, అరుణలతో తరచుగా గొడవలు జరుగుతూ వచ్చాయి. 
 
ఈ క్రమంలోనే అరుణ, అల్లుడు స్నేహిత్‌తో కలిసి బైకుపై వెళుతున్నారు. వారిద్దరూ బైకుపై వెళుతుండగా ఇద్దరి మధ్య పాత విషయాలపై వాగ్వాదం జరిగింది. దీంతో కోపంతో ఊగిపోయిన స్నేహిత్ బైకు నడుపుతూనే తాను పెట్టుకున్న హెల్మెట్ తీసి అత్త తలపై బలంగా కొట్టాడు. ఈ దాడిలో అదుపుతప్పి, రన్నింగ్ బైకు మీది నుంచి కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె తలకు బలమైన గాయంకావడంతో స్పృహ కోల్పోయింది. దీంతో ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. 
 
దీంతో భయపడిపోయిన నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు స్నేహిత్ ఒక నాటకానికి తెరలేపాడు. అరుణ ఫిట్స్ వచ్చిందని అందుకే బైకుపై నుంచి పడిపోయిందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అరుణ మృతి చెందింది. అరుణ మృతిపై కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా అసలు నిజం బయటపడింది. దీంతో నిందితుడుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
తమిళనాడు అసెంబ్లీ ఫలితాలు 2026 లైవ్