1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Hyderabad : Youth commits suicide during a video call with girl friend

ప్రియురాలితో వీడియో కాల్‌లో మాట్లాడుతూ ఉరేసుకున్న ప్రియుడు.. ఎక్కడ?

suicide
హైదరాబాద్ నగరంలోని బోడుప్పల్‌లో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తన ప్రియురాలితో వీడియో కాల్‌లో మాట్లాడుతూ ప్రాణాలు తీసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకున్నాడు. ఈ విషయాన్ని అతడి స్నేహితులకు తెలియజేయగా వారు హుటాహుటిన వెళ్లి ఆ యువకుడుని ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 
 
పోలీసుల కథనం మేరకు... బోడుప్పల్ అయ్యప్ప స్వామి దేవాలయం ప్రాంతంలో నివసించే ఓ ప్రైవేటు ఉద్యోగి కుమారుడు స్థానిక ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో చదువుతున్నాడు. ప్రస్తుతం మేడిపల్లిలోని ఓ కార్ల షోరూమ్‌లో ప్రాక్టికల్ శిక్షణ పొందుతున్నాడు. ఈ నెల 5వ తేదీ రాత్రి బాలుడి తల్లిదండ్రులకు షాపింగ్ కోసం బయటకు వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆ యువకుడు. తాను ప్రేమించిన అమ్మాయికి వీడియో కాల్ చేసి ఆమెతో మాట్లాడుతూనే చున్నీతో ఫ్యానుకు ఉరి వేసుకున్నాడు. ఈ ఘటనతో ఆందోళన చెందిన ఆ యువతి వెంటన అతడి స్నేహితులకు సమాచారం చేరవేసింది. 
 
వారు హుటాహుటిన బాలుడి ఇంటికి చేరుకోగా, అప్పటికే ఆ యువకుడు ఉరికి వేలాడుతున్నాడు. వెంటనే కిందకు దించి సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. సమాచారం తెలుసుకున్న మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. 
తర్వాతి కథనం
కులాంతర వివాహం చేసుకున్న దళిత యువకుడు... ఇంటికి నిప్పంటించిన యువతి తల్లిదండ్రులు