మంగళవారం, 17 మార్చి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 19 ఫిబ్రవరి 2026 (09:52 IST)

ప్రియురాలిని కిరాతకంగా హత్య చేసిన ప్రియుడు.. కామవాంఛ చల్లారక మృతదేహంపై లైంగిక చర్య... ఎక్కడ?

mba student
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో అత్యంత దారుణం, అమానుషన ఘటన ఒకటి వెలుగు చూసింది. తనతో పాటు ఎంబీఏ చదువుతున్న ప్రియురాలిని ఓ యువకుడు అతి కిరాతకంగా రేప్ చేసి హత్య చేశాడు. ఆ తర్వాత కూడా అతని కామవాంఛ తీరకపోవడంతో మృతదేహంపై కూడా లైంగిక చర్యకు పాల్పడ్డాడు. ఆ తర్వాత ఇండోర్ నుంచి ముంబైకు పారిపోయాడు. అక్కడ ఆమె ఆత్మతో మాట్లాడేందుకు తాంత్కిర పూజలు చేయడం ఇపుడు దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ కేసులో నిందితుడైన పియూష్ ధమనోటియా (24)ను పోలీలుసు అరెస్టు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ నెల 10వ తేదీన 24 ఏళ్ల ఎంబీఏ విద్యార్థిని, కాలేజీ స్నేహితురాలి పుట్టినరోజు వేడుకకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. అయితే రాత్రి 11 గంటల సమయంలో ఆమె ఫోన్ నుంచి తండ్రికి 'పాప ఇంటికి రాదు' అని సందేశం వచ్చింది. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అదేసమయంలో, ఆమె కాలేజీ వాట్సాప్ గ్రూప్ 11 అసభ్యకర వీడియోలు పోస్ట్ అయ్యాయి. ఈ వీడియోల గురించి కాలేజీ యాజమాన్యం సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
మూడు రోజుల తర్వాత, నిందితుడు పీయూష్ అద్దెకు ఉంటున్న గది నుంచి తీవ్రమైన దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు బద్దలుకొట్టి చూడగా, యువతి మృతదేహం నగ్నంగా, కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు కాళ్లకు ఉన్న సాక్స్ ఆధారంగా తండ్రి తన కూతురి మృతదేహాన్ని గుర్తించారు.
 
విచారణలో పీయూష్ చెప్పిన విషయాలు పోలీసులనే దిగ్భ్రాంతికి గురిచేశాయి. శారీరక సంబంధానికి నిరాకరించడంతో, ఆమెపై బలవంతంగా అత్యాచారం చేశానని అంగీరించాడు. ఆమె ప్రతిఘటించడంతో చేతులు, కాళ్లు కట్టేసి, నోట్లో గుడ్డ కుక్కి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాక కత్తితో పొడిచాడు. ఆ తర్వాత గదిలోనే మృతదేహం పక్కన కూర్చుని బీరు తాగాడు. అంతటితో ఆగకుండా మృతదేహంపై లైంగిక చర్యలకు పాల్పడ్డానని అంగీకరించాడు. 
 
హత్య తర్వాత ఆమె పోనును ధ్వంసం చేసి, ముంబైకు పారిపోయాడు. అక్కడ పాన్ వెల్ ప్రాంతంలో యూట్యూబ్‌లో వీడియోల చూసి, ఆమె ఆత్మను పిలిచి క్షమాపణలు చెప్పేందుకు తాంత్రిక పూజలు చేశాడు. ఈ కేసు విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడుని అరెస్టు చేశారు. అతని వద్ద విచారించగా.. ఏం జరగాల్సి వుందో అది జరిగిపోయిందంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. తన ప్రియురాలు డేటింగ్ యాప్‌లో ఇతరులతో మాట్లాడుతుందన్న అనుమానంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు నిందితుడు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.