శనివారం, 14 మార్చి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 22 జనవరి 2026 (13:44 IST)

దివ్యాంగురాలిని చంపి.. ఆత్మహత్యకు ప్రయత్నించిన కుటుంబ సభ్యులు

crime scene
తెలంగాణ రాష్ట్రంలోని కుత్బుల్లాపూర్ పరిధిలోని జగద్గరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ కుటుంబం సామూహిక అత్యాచానికి పాల్పడింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, విజయనగర్ కాలనీలో నివాసం ఉంటున్న సతీశ్ కుమార్, ఆయన భార్య ఆమని, కుమారుడు నితీశ్, కుమార్తె శ్రీజావణితో కలిసి జీవిస్తున్నారు. కొంతకాలంగా ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో మనోవేదనకు గురైన సతీశ్ దంపతులు, రెండు రోజులు క్రితం పుట్టుకతోనే దివ్యాంగురాలైన తమ కుమార్తె శ్రీజావళి (18)ని హతమార్చినట్టు సమాచారం. 
 
ఆ తర్వాత మిగిలిన ముగ్గురు మృతదేహంతోనే రెండు రోజులుగా ఇంట్లోనే ఉన్నారు. బుధవారం నాడు వారు చేతులు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించగా, కుమారుడు నితీశ్ ఈ విషయాన్ని తన స్నేహితుడికి తెలియజేశాడు. అతను సమాచారం ఇవ్వడంతో వెంటనే స్పందించిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న ముగ్గురుని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.