సోమవారం, 9 ఫిబ్రవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 5 ఫిబ్రవరి 2026 (17:19 IST)

ఆకలి తట్టుకోలేక గుక్కపెట్టి ఏడ్చిన చిన్నారి.. గొంతుపిసికి చంపేసిన కన్నతండ్రి...

crime news
ఆకలిని తట్టుకోలేక ఓ చిన్నారి గుక్కపెట్టి ఏడ్చింది. దీంతో విసుగు చెందిన కన్నతండ్రి ఆ చిన్నారి గొంతు పిసికి చంపేశాడు. ఈ దారుణం పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌లో చోటుచేసుకుంది. ఆ సమయంలో ఆ కసాయి తండ్రి డ్రగ్స్ మత్తులో ఉన్నట్టు సమాచారం. దీనిపై చిన్నారి మేనమాన ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చండీగఢ్‌కు చెందిన అర్విందర్ సింగ్ అనే వ్యక్తి తన భార్యాభర్తలతో కలిసి జలంధర్‌లోని దూరదర్శన్ ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్నాడు. అర్విందర్ దినకూలీగా పనిచేస్తుంటే, ఆయన భార్య ఓ ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తోంది. ఈ క్రమంలో అర్విందర్ గత కొంతకాలంగా డ్రగ్స్‌కు బానిసయ్యాడు. దీంతో తరచుగా ఇంట్లోనే మద్యం సేవించడం, డ్రగ్స్ తీసుకోవడం చేయసాగాడు. ఈ క్రమంలో ఈ నెల 3వ తేదీన భార్య పనికి వెళ్లగా, కూతురు నిహారిక (5)తో అర్వింద్ ఇంట్లోనే ఉన్నాడు. 
 
మధ్యాహ్నం అర్విందర్ మద్యం సేవిస్తుండగా, కుమార్తె నిహారిక ఆకలి కోసం గుక్కపెట్టి ఏడ్చింది. తొలుత ఆమెన గద్దించాడు. అయినప్పటికీ ఆ చిన్నారి ఏడుపు ఆపకపోవడంతో విసిగిపోయిన అర్విందర్ గొంతుపిసికి చంపేశాడు. ఇంటి పని ముగించుకుని ఇంటికి వచ్చిన తల్లి ఈ ఘోరం చూసి కన్నీటిపర్యంతమైంది. దీనిపై నిహారిక మేనమామ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.