సంబంధిత వార్తలు
- ఆరో అంతస్తు నుంచి బిడ్డతో దూకిన తల్లి (వీడియో)
- ప్రియుడితో జీవించేందుకు అడ్డుగా ఉన్న కుమార్తె... కన్నబిడ్డను గొంతునులిమి హత్య చేసిన తల్లి
- చేపల కూర సరిగా చేయలేదని భార్యను తిట్టిన భర్త... తర్వాత ఏం జరిగిందంటే...?
- Hyderabad: బెయిల్పై విడుదలైన రియల్టర్.. భార్యను కాల్చి చంపేశాడు..
- పచ్చటి కుటుంబంలో చిచ్చుపెట్టిన నాటు కోడికూర... ఎక్కడ?
కాకినాడ : జ్యూస్‌లో నిద్రమాత్రలిచ్చి భర్తను చంపేసిన భార్య
కాకినాడలో ఓ దారుణం జరిగింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపేసింది. జ్యూస్‌లో నిద్రమాత్రలిచ్చి ఈ దారుణానికి పాల్పడింది. కాకినాడ జిల్లా సర్పవరంలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సర్పవరం మండపం కాలనీకి చెందిన పుల్ల దుర్గాప్రసాద్ (38), దేవి భార్యాభర్తలు. వారికి ఇద్దరు కుమార్తెలు. భర్త ఆటో నడు పుతాడు. రెండేళ్ల కింద దుర్గాప్రసాద్ గుండెలో స్టంట్లు వేశారు. దాంతో అతను ఇంటి వద్దే ఉండేవాడు.
ఈ క్రమంలో దేవికి ఇన్‌స్టాగ్రామ్‌లో బాపట్లకు చెందిన ప్రసాదం గోపిసాయి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. గోపిసాయి బైకుపై బాపట్ల నుంచి సర్పవరం వచ్చి దేవిని కలిసి నిద్ర మాత్రలు ఇచ్చి దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య భర్త దుర్గాప్రసాద్ ప్రియుడు గోపిసాయి భార్య దేవి చంద్రపురం తదితర ప్రాంతాలకు తీసుకెళ్లే వాడు.
భార్య వ్యవహారంపై అనుమానం రావడంతో దుర్గాప్రసాద్ నిలదీశాడు. ఫోనులో చాటింగ్ చేయకుండా నిలువరించాడు. అయినప్పటికీ దేవి ప్రియుడితో సంబంధం కొనసాగించింది. అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకునేందుకు, నిద్రమాత్రలతో హతమారుద్దామని ప్లాన్ వేసి ప్రియుడికి చెప్పింది. దీంతో గోపిసాయి బాపట్ల నుంచి 15 నిద్రమాత్రలు కొనుగోలు చేసి దేవికి ఇచ్చాడు. ఈ ఏడాది మార్చి 13న ఖర్జూజ జ్యూస్‌లో 13 నిద్రమాత్రలు వేసి భర్తతో తాగించింది. అతను అపస్మారక స్థితిలోకి వెళ్లగా, బతుకు తాడేమోనన్న భావనతో ముఖంపై దిండు అదిమి పట్టుకుని ఊపిరాడకుండా హతమార్చింది. అనంతరం భర్తకు గుండెపోటు వచ్చిందని దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
అయితే భర్త హత్య అనంతరం దేవి ప్రియుడితో మాట్లాడటం మానేసింది. దీంతో ఆమె తనకు దూరమవుతుందని, వేరొక వ్యక్తితో సంబంధం కొనసాగిస్తున్నట్లు భావించిన గోపిసాయి.. మూడు నెలల తర్వాత ఈ నెలలో దేవి కుమార్తె సెల్‌ఫోనులో వాట్సాప్‌లో ఓ మెసేజ్ పంపాడు. 'మీ నాన్నను మీ అమ్మే చంపేసింది. నిద్రమాత్రలను నేనే మీ 'అమ్మకు ఇచ్చాను' అంటూ అందులో పేర్కొన్నాడు. దీంతో మృతుడి సోదరుడు సత్తిబాబు దుర్గాప్రసాద్ సహజ మరణం కాదని, అతని భార్యనే హత్య చేసిందని భావించి ఈనెల 9న సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసులోని మిస్టరీని ఛేదించారు.
