భర్తను కత్తితో పొడిచి చంపేసింది... కొడుకును కత్తితో పొడించింది... తాపీగా ఫోన్ చూస్తూ....
కర్నాటక రాష్ట్రంలోని ధార్వాడ జిల్లాలో ఓ మహిళ వైద్యురాలు అత్యంత కిరాతకంగా ప్రవర్తించింది. భర్తను కత్తితో పొడిచి చంపేసింది. అదే కత్తితో కొడుకునూ పొడించింది. ఆ తర్వాత తాపీగా మంచంపై పడుకుని మొబైల్ ఫోన్ చూస్తూ కూర్చొండిపోయింది. ఆ మహిళా డాక్టర్ పైశాచికత్వ చర్య చూపరులను నివ్వెరపరిచింది. కర్ణాటకలోని ధార్వాడలో ఈ ఘటన జరిగింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, నగరంలోని అనస్థీషియా వైద్యుడు డాక్టర్ కిరణ్ హొన్నణ్ణనవరు ఆయన భార్య, కంటివైద్య నిపుణురాలు డాక్టర్ ప్రియాంక కత్తితో పొడిచి హత్య చేశారు. ఎనిమిదేళ్ల కన్నకొడుకును కూడా అదే కత్తితో పొడిచారు. ఏమీ ఎరగనట్టు మంచంపై పడుకుని ఫోను చూసుకుంటున్నారు.
ప్రియాంక, కిరణు గతంలో వేర్వేరు వ్యక్తులతో వివాహం జరిగింది. తమ భాగస్వాములతో విడిపోయాక, మ్యాట్రిమోని సహకారంతో పెళ్లి చేసుకున్నారు. ప్రియాంక సంపన్న కుటుంబానికి చెందిన వారు కాగా కిరణ్ పేద కుటుంబానికి చెందినవారు. ప్రియాంక డాక్టరే అయినా, ప్రాక్టీస్ చేయడం లేదు. కిరణ్ వైద్య సేవలను కొనసాగిస్తున్నారు.
పేదలపట్ల మానవత్వం చూపుతూ, ధార్వాడలో మంచిపేరు సంపాదించారు. వీరిద్దరికీ వివాహమైన కొంతకాలం తర్వాత విభేదాలు తలెత్తినట్లు తెలిసింది. ప్రియాంక తన భర్తను అనుమానిస్తూ, నిత్యం గొడవపడేవారని తెలుస్తోంది. కిరణ్ కుటుంబీకులు ఇంటికి రాకూడదని ఆమె అభ్యంతరం చెప్పినట్లు విచారణలో తేలింది. ఈ క్రమంలో బుధవారం తీవ్ర ఆగ్రహానికి లోనైన ప్రియాంక, పదునైన కత్తితో కిరణ్ పై విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చారు.
అదే కత్తితో తమ ఎనిమిదేళ్ల కుమారుడిని రెండుమార్లు పొడిచారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు, డాక్టర్ ఇంటికి చేరుకున్నారు. వారి కుమారుడికి శ్వాస ఆడుతుండటంతో వెంటనే ఆసు పత్రికి తరలించి, వైద్య సేవలు అందిస్తున్నారు. బాలుడికి రక్తస్రావం కావ డంతో నీరసంగా ఉన్నాడని, ప్రాణాపాయం లేదని వైద్యులు నిర్ధారించారు.
