ఆస్తి కోసం కిరాతకంగా మారిన కుమార్తె.. స్కార్పియో ఎక్కించి తల్లిని హత్య చేసింది.. తండ్రిని కూడా?
Crime news
పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేసి అసలు నిజాన్ని నిగ్గుతేల్చారు. ఆస్తి గొడవలు, ఇతర కుటుంబ కలహాల కారణంగానే ఆమె 23 ఏళ్ల కూతురు.. ఇంకా లా స్టూడెంట్ అయిన ఆయుషి శర్మే సుపారీ ఇచ్చి ఈ దారుణానికి పాల్పడినట్లు నిర్ధారించి ఆమెను అరెస్ట్ చేశారు.
ఈ తల్లి హత్య కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే, కేసులో మరో ఊహించని మలుపు తిరిగింది. ఆయుషి మేనమామ రాకేష్ శర్మ రంగంలోకి దిగి పోలీసులకు, కోర్టుకు సంచలన ఫిర్యాదు చేశారు. ఏడాది క్రితం మరణించిన ఆయుషి తండ్రి విజయ్ శర్మది సహజ మరణం కాదని, అది కూడా ఆయుషి చేసిన పక్కా ప్లాన్ హత్యేనంటూ ఆయన ఆరోపించారు. బ్రెయిన్ హెమరేజ్‌తో బాధపడుతూ కోలుకుంటున్న తన తండ్రికి ఆయుషి కావాలనే సరైన వైద్యం అందకుండా చేసిందని రాకేష్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
పోలీసుల విచారణలో నిందితురాలు ఆయుషి శర్మ తన తప్పులను ఒప్పుకుంది. దివ్యాంగుడైన తన తమ్ముడిపై తల్లి ఎక్కువ ప్రేమ చూపించడం, తనను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయడం వల్ల చిన్నప్పటి నుంచే తల్లిపై విపరీతమైన ద్వేషం పెంచుకున్నట్లు విచారణలో తెలిపింది. దీనికి ఆస్తి వివాదాలు కూడా తోడవడంతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అంగీకరించింది.
పోలీసుల సమాచారం ప్రకారం, కాంట్రాక్ట్ కిల్లర్లు నెల రోజుల క్రితం కూడా నీరజ్ శర్మను చంపడానికి ప్రయత్నించారు, కానీ ట్రాఫిక్ కారణంగా విఫలమయ్యారు. ఇక ఈ కేసులో హేమంత్, ఆకాష్, మోహిత్, అరవింద్, రోహిత్ అనే కాంట్రాక్ట్ కిల్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. బలరామ్ కోసం గాలింపు కొనసాగుతోంది.
