సంబంధిత వార్తలు
180 మంది బాలికలపై లైంగికదాడి... 350కి పైగా అశ్లీల వీడియోలు.. బీజేపీ ఎంపీ ఫిర్యాదు
మహారాష్ట్రలో ఓ షాకింగ్ ఘటన ఒకటి వెలుగు చూసింది. ఓ కామాంధుడు ఏకంగా 180 మంది బాలికలపై లైంగికదాడికి తెగబడ్డాడు. అలాగే 350కి పైగా అశ్లీల వీడియోలు చిత్రీకరించాడు. దీనిపై బీజేపీ ఎంపీ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ఆ కామాంధుడిని అరెస్టు చేశారు.
పోలీసుల కథనం మేరకు.. మహారాష్ట్రంలోని పరాత్వడ నగరానికి చెందిన మహమ్మద్ అయాజ్ అలియాస్ తన్వీర్ అనే యువకుడు బాలికలను ప్రేమ పేరుతో ట్రాప్ చేసేవాడు. ఆ తర్వాత మాయమాటలు చెప్పి వారిని ముంబై, పూణేలకు తీసుకెళ్లేవాడు. అక్కడ వారి అశ్లీల వీడియోలు చిత్రీకరించేవాడన్న ఆరోపణలు ఉన్నాయి.
ఆ తర్వాత ఈ వీడియోలను ఉపయోగించి బాలికలను బ్లాక్‌మెయిల్ చేయడంతో పాటు.. కొన్నింటిని ఆన్‌లైన్‌లో కూడా షేర్ చేశాడు. ఓ వినతిపత్రం ద్వారా రాజ్యసభ ఎంపీ అనిల్ బోండేకు ఈ విషయం తెలిసింది. నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసి.. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిట్ ఏర్పాటు చేసి దీనిపై దర్యాప్తు చేపట్టకపోతే ఎస్పీ కార్యాలయం ముందు నిరసనకు దిగుతానని ఆయన హెచ్చరించారు. ఈ క్రమంలోనే పోలీసులు అతడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.
కోర్టు అతడిని ఏడు రోజుల కస్టడీకి అప్పగించింది. నిందితుడి మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో వందలకొద్దీ అసభ్యకరమైన వీడియోలు ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ఆ వీడియోలను ఎవరికైనా షేర్ చేశాడా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. సైబర్ సెల్ సాయంతో ఆన్‌లైన్‌లో షేర్ అయిన వీడియోలను తొలగించే చర్యలు చేపట్టారు.
