1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Maharashtra Woman Teams With Husband, Kills Lover, Stuffs Body In Drum

సీన్ రివర్స్: ప్రియుడు డబ్బులివ్వలేదు.. భర్త సాయంతో చంపి డ్రమ్ములో కుక్కి డ్రైన్‌లో పడేసింది

crime scene
కథ రివర్స్ అయ్యింది. భర్తలను ప్రియుడి సాయంతో చంపేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం సీన్ రివర్స్ అయ్యింది. ప్రేమ, డబ్బు వ్యవహారంలో ఓ వివాహిత తన ప్రియుడిని దారుణంగా హత్య చేసిన ఘటన మహారాష్ట్రలోని థాణేలో వెలుగుచూసింది. 
 
హత్యకు తన భర్త సహాయం తీసుకుని, మృతదేహాన్ని ఓ డ్రమ్ములో కుక్కి డ్రైన్‌లో పడేసింది. వివరాల్లోకి వెళితే, ముంబ్రాకు చెందిన అర్బాజ్ మక్‌సూద్ అలీ ఖాన్ (26) డోంబివలిలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి వసాయ్‌కు చెందిన మెహజబీన్ ఖాతూన్ (25) అనే వివాహితతో 2021 నుంచి సంబంధం ఉంది.
 
మెహజబీన్ తరచూ అర్బాజ్ నుంచి డబ్బులు తీసుకునేది. ఇటీవల అర్బాజ్ డబ్బు ఇవ్వడం ఆపడంతో, అతడిని అడ్డు తొలగించుకోవాలని ఆమె నిర్ణయించుకుంది. తన భర్త హసన్ షేక్, సోదరుడు తారిక్ షేక్, అతని స్నేహితుడు మొజ్జమ్ పఠాన్‌తో కలిసి హత్యకు కుట్ర పన్నింది. అతనిని హత్య చేసింది. 
 
అనంతరం మృతదేహాన్ని ఓ డ్రమ్ములో పెట్టి సమీపంలోని డ్రైన్‌లో పడేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను అరెస్ట్ చేసి వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
వావ్, క్యాంపస్ సెలక్షన్స్‌లో విజయవాడ విద్యార్థినికి రూ. 48 లక్షల ప్యాకేజీ