సంబంధిత వార్తలు
- ఐదు సూత్రాల చుట్టూ తిరిగే జీవితనేపథ్యంగా ఏదైనా సాధ్యమే మూవీ
- దళిత డ్రైవర్ హత్య కేసు : వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు
- Balakrishna: బాలకృష్ణ 'సింహా' తెలుగు సినిమా కీర్తిని తెచ్చిపెట్టి 16 ఏళ్లు
- సాక్ష్యం చెప్పలేదో చంపి శవాన్ని డోర్ చెలివరీ చేస్తా : వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు వార్నింగ్
- వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు
పెళ్లి చేసుకోమన్న యువతి.. మత్తిచ్చి ఊపిరాడకుండా చేసి చంపేశారు...
ప్రేమించిన యువతిన పెళ్లి చేసుకోమన్నందుకు శవమై తేలింది. ఆమెను ప్రేమించిన ప్రియుడు మరో ప్రేయసి, సోదరుడితో కలిసి దారుణానికి పాల్పడ్డాడు. తన ప్రియురాలికి మత్తిచ్చి ఊపిరాడకుండా చేసి చంపేసాడు. ఈ దారుణం ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
జిల్లాలోని ఎం.సింగుపురానికి చెందిన రెడ్డి భువనేశ్వర్ అనే యువకుడికి.. బర్న సీతంపేటకు చెందిన బి ఉషారాణి మధ్య సన్నిహిత సంబంధం ఉంది. ఇద్దరూ కలిసి వైసీపీ హయాంలో వలంటీర్లుగా పనిచేశారు. బొడ్లపాడుకు చెందిన తేగెల కృపారాణి అనే మరో యువతితో కూడా భువనేశ్వర్ సన్నిహితంగా ఉంటూ వచ్చాడు. ఈ విషయం తెలిసి తనను పెళ్లి చేసుకోవాలని ఉషారాణి.. ఒత్తిడి తెచ్చింది. దీంతో ఆమె వదిలించుకునేందుకు భువనేశ్వర్.. కృపారాణితో కలిసి హత్యకు ప్లాన్ వేశాడు.
ఈ నెల 5న ఉషారాణికి ఫోన్ చేసి రాయగడకు రావాలని చెప్పాడు. 6న ఆమె డోలమడ సెంటర్‌కు వచ్చింది. భువనేశ్వర్ తన వరసకు తమ్ముడైన సవరిగాన తేజ సాయం తీసుకున్నాడు. వీరిద్దరూ కారులో ఉషారాణిని ఎక్కించుకుని రాయగడకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఉషారాణికి మత్తు మాత్రలు కలిపిన జ్యూస్ ఇచ్చారు. ఆమె మత్తులోకి జారుకుంది. తర్వాత కారులో నవగాం జంక్షన్‌కు వచ్చి ఉషారాణి పరిస్థితిని అక్కడే ఉన్న కృపారాణికి వివరించారు.
అక్కడి నుంచి అందరూ కొల్లివలస వరకు చేరుకుని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ వద్ద కారు ఆపారు. మత్తులో ఉన్న ఉషారాణిని భువనేశ్వర్, తేజ, కృపారాణి శ్వాస ఆడకుండా చేసి చంపేశారు. కొద్ది దూరం ప్రయాణించి మృతదేహాన్ని చెరువులో పడేశారు. ఈ నెల 10న తన కుమార్తె తప్పిపోయినట్టు ఉషారాణి తండ్రి చిన్నారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తుమరాడ పరిధిలోని కామినాయుడు చెరువులో ఓ మహిళ మృతదేహం ఉన్నట్టు పోలీసులు గుర్తించి ఉషారాణి తండ్రికి సమాచారం అందించారు. చివరికి శుక్రవారం ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
