1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Nellore District Venkatagiri : A mother and her nine-year-old son lost their lives in a domestic tragedy

తల్లి క్షణికావేశం - పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు...

walk on fire
ఓ తల్లి క్షణికావేశంలో ఓ తల్లి తీసుకున్న నిర్ణయంతో రెండు ప్రాణాలు పోయాయి. ఈ విషాదకర ఘటన నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలను పరిశీలిస్తే, 
 
వెంకటగిరి పట్టణంలోని ఆత్మామాలిక్‌ ధ్యాన మందిరంలో నాగేశ్వర శర్మ పండితుడిగా పని చేస్తున్నారు. ఆయనకు భార్య లీలాబాలశ్రావణి (35), కుమారుడు చంద్రమౌళి (9), ఓ కుమార్తె (7) ఉన్నారు. లీలాబాలశ్రావణి సోమవారం సాయంత్రం కుమారుడిని ద్విచక్ర వాహనంపై తీసుకొని కాశీతోటలోని శివాలయం వద్దకు చేరుకున్నారు. 
 
నిర్మానుష్య ప్రాంతంలో తనతో పాటు కుమారుడిపై పెట్రోలు పోసి నిప్పంటించుకుంది. మంట వేడి తాళలేక చంద్రమౌళి కేకలు వేస్తూ.. తుప్పల్లో పరుగులు తీశాడు. సమీపంలోని ఆటో డ్రైవర్లు గమనించి ఆరా తీయగా.. తన తండ్రి సెల్‌ఫోన్‌ నంబరు ఇచ్చి సమాచారం తెలియజేయాలని కోరాడు. విషయం తెలుసుకున్న నాగేశ్వరశర్మ అక్కడి చేరుకున్నారు. 
 
భార్య చనిపోయి ఉండటంతో చేసేది లేక కుమారుడిని తీసుకొని తిరుపతి బయలుదేరాడు. సగం దూరం వెళ్లేసరికి బాలుడు సైతం ప్రాణాలు కోల్పోయాడు. వీరిద్దరూ బయటకు వచ్చిన సమయంలో కుమార్తె ఆడుకోవడానికి వెళ్లిపోవడంతో ప్రాణాలతో బయటపడిందని స్థానికులు చెబుతున్నారు. ఆ మహిళ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సివుంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
బాలిక నోట్లో పెన్ క్యాప్ పెట్టి నీళ్లు పోసిన సాటి విద్యార్థినిలు... తర్వాత ఏం జరిగింది?