1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Obsessed lover stabs nursing student to death 11 times after she refused marriage, Video

పెళ్లికి నిరాకరించిన నర్సింగ్ విద్యార్థినిని 11 సార్లు కత్తితో పొడిచి చంపిన ప్రేమోన్మాది, వీడియో

Accused
ఛత్తీస్ గఢ్ లో ఘోరం జరిగింది. పెళ్లికి నిరాకరించిందన్న ఆగ్రహంతో ఓ నర్సింగ్ విద్యార్థినిని అత్యంత పాశవికంగా హత్య చేసాడు ఓ ప్రేమోన్మాది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. 19 ఏళ్ల ఖుషీ సాహు భిలాయ్ లోని హాస్టల్లో వుంటూ నర్సింగ్ విద్యను అభ్యసిస్తోంది. ఈ క్రమంలో ఆమెను 24 ఏళ్ల పింటూ అనే జులాయి యువకుడు తనను పెళ్లాడాలంటూ వేధించడం ప్రారంభించాడు. యువతి స్నేహితురాళ్ల ద్వారా ఖుషీ ఫోన్ నెంబర్ సంపాదించిన పింటూ తరచూ ఆమెకి ఫోన్ చేసి వేధించడం మొదలుపెట్టాడు.
 
తనను పెళ్లాడాలంటూ పదేపదే ఇబ్బంది పెడుతుండటంతో అతడి ఫోన్ నెంబరును బ్లాక్ చేసింది ఖుషీ. దీనితో తీవ్ర ఆగ్రహానికి గురైన పంటూ ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఆమె అద్దెకి వుంటున్న ఫ్లాట్లో హత్య చేసేందుకు వెళ్లాడు. కానీ ఆరోజు అతడికి సాధ్యం కాలేదు. 
 
మరుసటి రోజు పక్క ప్రణాళికతో వెళ్లి ఆమెపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి 11 సార్లు పొడిచాడు. దాంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందింది. దాంతో ఆ హంతకుడు అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు... నిందితుడి కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డారు. 24 గంటల లోపే అతడిని అరెస్ట్ చేసి చేతులకు బేడీలు వేసి నడిరోడ్డుపై నడిపించుకుంటూ వెళ్లారు.
About Writer
ఐ వెెంకట్
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలలో పనిచేసారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పెద్ద తలనొప్పిగా మారిన విజయ సాయి రెడ్డి