హర్యానాలో దారుణం.. టీచర్‌పై కత్తితో దాడి.. 30 సెకన్లలో 34 చోట్ల కత్తిపోట్లు
Crime
బాధితురాలి కేకలు విని పాఠశాల నిర్వాహకుడు వెంటనే రక్షించేందుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయితే, అప్పటికే రక్తపు మడుగులో పడి ఉన్న సంధ్యను కాపాడే ప్రయత్నం చేయగా, నిందితుడు ఆయనపైకి కూడా దాడికి యత్నించాడు. దాడికి సంబంధించిన భయంకర దృశ్యాలు పాఠశాల సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కాగా, ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సంధ్యను పాఠశాల సిబ్బంది వెంటనే అల్ ఫలాహ్ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమె శరీరంపై మొత్తం 34 చోట్ల కత్తిపోట్లు ఉన్నట్లు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న సిక్రోనా పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టి, గంటల వ్యవధిలోనే అమిత్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మృతురాలిపై వేధింపులకు గురిచేశాడని తెలుస్తోంది.
