1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. pulivendula : mother abetting the attempted rape of a daughter

ప్రియుడు గదికి కుమార్తెను బలవంతంగా పంపిన తల్లి... ఎక్కడ?

victim woman
కన్నకుమార్తెపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడేందుకు కన్నతల్లి సహకరించింది. రెండు నెలల క్రితం జరిగిన చోటుచేసుకోగా బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఏపీలోని ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి పులివెందులకు చెందిన ఓ మహిళతో 2010లో వివాహమైంది. వారికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. 
 
ఈ క్రమంలో ఆ మహిళ భర్త 2017లో కువైట్‌కు వెల్లాడు. దీంతో తన ఇద్దరు పిల్లలతో కలిసి భార్య పులివెందులలోనే ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటోంది. ఈ క్రమంలో ఆమెకు పులివెందులకు చెందిన నవ కిషోర్ అనే యువకుడితో పరిచయం ఏర్పడి అది అక్రమ సంబంధానికి దారితీసింది. ఈ విషయం భర్తకు తెలియడంతో గత యేడాది భార్య నుంచి దూరమయ్యాడు. అప్పటి నుంచి తన ఇద్దరు పిల్లలతో ఆ మహిళ పులివెందులలో ఉంటోంది. 
 
ఈ క్రమంలో నవ కిషోర్ సదరు మహిళ కుమార్తెపై అసభ్యంగా ప్రవర్తించసాగాడు. ఈ విషయం తల్లికి చెప్పింది. ఆమె పట్టించుకోకపోగా బయటకు చెబితే చంపేస్తానని కుమార్తెను బెదిరించింది. రెండు నెలల క్రితం తన కుమార్తెను నవ కిషోర్ ఉన్న గదిలోకి బలవంతంగా పంపించింది. అతను అత్యాచారయత్నానికి పాల్పడడంతో బాలిక గట్టిగా కేకలు వేసి తప్పించుకుంది. అనంతరం బాలిక ప్రొద్దుటూరుకు చేరుకుని తండ్రికి విషయం చెప్పింది. 
 
ఈ నెల 24వ తేదీన బాలిక తల్లి, అమ్మమ్మ, నవ కిషోర్‌, చెల్లి స్వాతి ప్రొద్దుటూరులోని బాలిక వద్దకు చేరుకుని తమతోపాటు రావాలని బలవంతం చేశారు. ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. దీంతో బాలిక తండ్రి స్థానిక మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా బాలిక తల్లి, నవ కిషోర్, బాలిక చెల్లి స్వాతి, అమ్మమ్మలపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
తెలంగాణలోని పలు జిల్లాల్లో రాత్రంతా కురిసిన వర్షాలు.. ప్రజలకు వేడి నుంచి ఉపశమనం