1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Six killed in Karnataka's Vijayapura over farmland dispute

ఆస్తి వివాదం.. కుటుంబానికి చెందిన ఐదుగురి హత్య ... ఎక్కడ?

murder
కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరు నగర శివారు ప్రాంతంలో దారుణం జరిగింది. ఆస్తి వివాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని కళ్లలో కారం చల్లి దారుణంగా నరికి చంపేశారు. అలాగే, మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన రాష్ట్రంలోని విజయపుర జిల్లా గోవిందవాడలో జరిగింది. ఓ కుటుంబంలో 10 ఎకరాల ఆస్తికి సంబంధించిన వివాదంలో సమస్య పరిష్కారానికి గ్రామపెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. 
 
ఈ క్రమంలో మాటామాటా పెరిగడంతో వారి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో బంధువులు రెండు వర్గాలుగా చీలిపోయారు. ప్రత్యర్థి వర్గంపై మరో వర్గం పథకం ప్రకారం కళ్ళలో కారం చల్లి కత్తులతో నరికి చంపేశారు. ఈ ఘటనలో చనిపోయిన వారిలో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందినవారు కావడం గమనార్హం. సమాచారం అందుకున్న విజయపుర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

ఇంట్లో ఒంటరిగా మహిళపై అత్యాచారం - సీఐ పరారీ... ఆచూకీ కనిపెట్టని పోలీసులు 
 
ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై ఖాకీ సీఐ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఠాణా నుంచి పారిపోయాడు. ఈ సంఘటన జరిగి నెల రోజులు అయినప్పటికీ పోలీసులు మాత్రం తమ సీఐపై సానుభూతి చూపిస్తూ, ఆయన ఆచూకీని కనిపెట్టలేకపోతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఏపీలోని పల్నాడు జిల్లా బ్రాహ్మణపల్లిలో ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో సీఐ చిన్నమల్లయ్యపై గత నెల 29న వినుకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదైన విషయం తెలిసి సీఐ పోలీసులకు చిక్కకుండా పారిపోయి నెల రోజులు అవుతున్నా నేటికీ అతని ఆచూకీ కనిపెట్టలేకపోయారు. కేసు నమోదు కావడంతో ఈనెల 2న గుంటూరు ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి చిన్న మల్లయ్యను సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. 
 
ఈ కేసు నమోదైనప్పుడు బ్రాహ్మణపల్లిలోనే ఉన్నా పట్టుకోవడంలో జాప్యం వల్ల తప్పించుకున్నట్లు, దానికి స్థానిక పోలీసులు సహకరించారనే ఆరోపణలున్నాయి. గతంలో రెండేళ్లు సైబర్‌క్రైంలో పనిచేసిన అనుభవంతో సెల్‌ఫోన్‌ వాడకుండా జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. ఆయన హైదరాబాద్‌లో ఉన్నారనే సమాచారం మేరకు మూడు బృందాలు ఇటీవల అక్కడికి వెళ్లి గాలించినా ఆచూకీ లభ్యంకాలేదు. 
 
ముందస్తు బెయిల్‌కి హైకోర్టును ఆశ్రయించగా బెయిల్‌ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. ఇదిలావుండగా, సీఐ కుమారుడు తనను బెదిరిస్తున్నాడని బాధితురాలు ఆరోపిస్తూ సాక్ష్యాలను కోర్టుకు సమర్పించారు. తనకు సీఐ కుటుంబం నుంచి ప్రాణహాని ఉందని, తన భద్రతకు ముప్పు ఉన్నందున రక్షణ కల్పించాలని కోరుతున్నారు.  
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
కర్నాటక నుంచి రాజ్యసభకు వైఎస్ షర్మిల?