పిల్లనిచ్చిన అత్త ప్రేమలో పడిన అల్లుడు, లేచిపోయి పెళ్లి చేసుకున్నారు, వీడియో
పిల్లనిచ్చిన అత్తతోనే ప్రేమలో పడిపోయాడు ఆ అల్లుడు. తన భార్యను వదిలేసి అత్తతోనే కాపురం చేయడం మొదలుపెట్టాడు. ఇది కాస్తా కుటుంబ సభ్యులకు తెలిసేలోపుగానే ఇద్దరూ పరారై కోర్టులో పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటన కాన్పూర్ దేహాత్‌లో జరిగింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ దేహాత్ అక్బరూర్ పరిధిలో ఓ అల్లుడు తరచూ అత్తగారింటికి వస్తున్నాడు. కట్టుకున్న భార్యను ఇంటివద్ద వదిలేసి అత్తారింటికి తరచూ వస్తుండటంతో కుటుంబ సభ్యుల్లో అనుమానం మొదలైంది. వారి అనుమానాన్ని ఆ అత్తాఅల్లుళ్లు నిజం చేసారు. లోకం ఏమనుకుంటుందన్న విషయాన్ని కూడా పట్టించుకోని వారు ఇంటి నుంచి పారిపోయారు. తామిద్దరం ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకోదలిచామంటూ కోర్టు ముందు చెప్పి పెళ్లి చేసుకున్నారు. దానికి సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని సైతం చూపించారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పిల్లనిచ్చిన అత్తగారితో అల్లుడి పెళ్లి
— AVM (@AvmNews7) June 8, 2026
కాన్పూర్ దేహాత్: ప్రేమకు వయసుతో పనిలేదు.. బంధుత్వాలతో అస్సలే సంబంధం లేదు అనుకున్నారో ఏమో..
ఓ అల్లుడు తన అత్తగారి అందానికి ముగ్ధుడై ఆమెనే పెళ్లాడాడు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ దేహాత్ అక్బర్పూర్ పరిధిలో ఈ విచిత్ర ఘటన వెలుగుచూసింది.… pic.twitter.com/mjwXbrkEVw
