శనివారం, 14 మార్చి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 6 జనవరి 2026 (09:56 IST)

నా కొడుకు పరువు తీసింది.. అందుకే కోడలిని చంపేశా: నిందితురాలు

kallakurchi woman
సమాజంలో తన కుమారుడు ఎంతో పరువు మర్యాదలతో పాటు గౌరవంగా బతికేవాడని, అతని పరువు పోయేలా చేయడం వల్లే తన కోడలిని హత్య చేసినట్టు ఓ వృద్దురాలి చెప్పారు. తమిళనాడు రాష్ట్రంలోని కల్లకుర్చి జిల్లా విరియూర్‌కు చెందిన ఫిజియోథెరపిస్టు రొజారియా భర్త చనిపోయిన మహిళను రెండో వివాహం చేసుకున్నారు. రొజారియా తల్లి కోడలిని గత నెల 29వ తేదీ హతమార్చింది. 
 
దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి, నిందితురాలు క్రిస్తోప్‌మేరిని అరెస్టు చేశారు. ఆమె వద్ద పోలీసులు విచారించారు. పోలీసులకు నిందితురాలు ఇచ్చిన వాంగ్మూలంలో.. తాను, తన కుమారుడు సమాజంలో ఎంతో గౌరవంగా జీవించామని, నందిని తన కుమారుడిని పెళ్లి చేసుకొని కుటుంబ గౌరవాన్ని పాడుచేసిందని మండిపడ్డారు. 
 
అందుకే కోడలిని చంపి తన కుమారుడికి మరో వివాహం చేయాలని నిర్ణయించినట్టు తెలిపింది. పథకం ప్రకారం తన స్నేహితురాలు ఎమిలి సాయంతో నందినిని శంకాపురం సమీపంలోని చోళంపట్టు మణిముత్తారు నది తీరానికి తీసుకెళ్లి కత్తితో నరికి తల, మొండెం వేర్వేరుగా పూడ్చిపెట్టినట్లు అంగీకరించింది.