1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Teacher-s sexual harassment; student hits him with a slipper; video goes viral

టీచర్ లైంగిక వేధింపులు, చెప్పుతో కొట్టిన విద్యార్థిని, వీడియో వైరల్

Girl student beats teacher
విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులలో కొందరు కామాంధులుగా మారుతున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సెవ్రహి పోలీసు స్టేషను పరిధిలో వున్న ఓ కోచింగ్ సెంటర్లో విద్యార్థినిపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీనితో విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది విద్యార్థిని. అంతా కలిసి కోచింగ్ సెంటరుకి వచ్చారు.
 
లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఉపాధ్యాయుడిని బాధిత యువతి చెప్పుతో కొట్టింది. తోటి ఉపాధ్యాయులు చూస్తుండగానే ఆమె కోచింగ్ సెంటర్లో టీచర్ పైన చెప్పుతో కొట్టింది. క్లాసులు అయిపోయాక ఉద్దేశ్యపూర్వకంగా యువతిని ఉండమని చెప్పి, ఆ తర్వాత ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని విద్యార్థిని ఆరోపిస్తోంది. విషయం తెలుసుకుని కుటుంబ సభ్యులు కోచింగ్ సెంటరుకి చేరుకుని ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసారు. ఈ ఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
About Writer
ఐవీఆర్
తర్వాతి కథనం
జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్ - మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ హతం