1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Wife has extramarital affair with friend; husband catches her red-handed and murders her

రేయ్ జోస్ బ్రో, రాత్రి నా బెడ్రూంలో నా పెళ్లాంతోనే గడుపుతావా? అయ్యో నా భార్యను చంపేసాను, ఇప్పుడు నేను కూడా... వీడియో

Wife and husband
తమిళనాడులో ఘోరం జరిగింది. భార్య వేరొకరితో అక్రమ సంబంధం సాగించడాన్ని భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఆ సమయంలో అతడు వీడియో కూడా తీసాడు. ఆ వీడియోలో అతను... ఏయ్.. లోపల ఎవరున్నారు, వాడిని బైటక రమ్మను అంటూ భార్యను గద్దించాడు. భార్య అతడితో... నువ్వు నోరుమూయ్, నేను అతడిని తీసుకు వస్తాలే అని చెప్పింది. కోపంతో ఊగిపోయిన భర్త... ఈ డ్రెస్ ఏంటి? లోపల మన బెడ్రూంలో వున్నది ఎవరు? పిలువ్ వాడిని బైటకు అంటూ ఆమెను గద్దిస్తుండగా లోపల నుంచి భార్యతో ఏకాంతంగా గడుపుతున్న వ్యక్తి వచ్చాడు.
 
జోస్ బ్రో రేయ్ జోస్ బ్రో, రాత్రి నా బెడ్రూంలో నా పెళ్లాం నా పెళ్లాం గదిలో నీకు రాత్రి ఏం పనిరా, నిలబడరా అంటుండగా అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ వీడియో తర్వాత మరో వీడియో పోస్ట్ చేసాడు బాధితుడు. అందులో... షర్ట్ నిండా రక్తపు మరకలతో కనిపిస్తూ... అయ్యో, నా పెళ్లాన్ని ఇప్పుడే చంపేసి వచ్చా. 
 
నేను ఎన్నిసార్లు వాడితో మాట్లాడవద్దని చెప్పినా వినలేదు. చివరికి వాడితో గడపడాన్ని చూసి తట్టుకోలేక చంపేసా. నా కుటుంబం నాశనమైపోయింది. నా ఫ్యామిలీని నాశనం చేసిన జోస్ కోసం వెతికాను. కానీ వాడు నాకు దొరకలా. అయ్యా... మీ కాళ్లకు దణ్ణం పెడతా. వాడిని పట్టుకుని కఠిన శిక్ష విధించండి. ఇక ఇప్పుడు నేను నా బిడ్డను కూడా చంపేసి నేను కూడా చనిపోతాను అంటూ బోరున విలపించిన వీడియో పోస్ట్ చేసాడు. ఐతే ఈ దారుణం ఎక్కడ జరిగిందన్నది తెలియరాలేదు. కాగా తాజా సమాచారం ప్రకారం బాధితుడు, అతడి కుమారుడు క్షేమంగానే వున్నట్లు తెలుస్తోంది. అతడి భార్యపై దాడి చేసి ఆమెను చంపేసానని అనుకున్నాడు కానీ ఆమె తీవ్ర గాయాలతో పడి వుండగా ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.
 
 
 
 
 
About Writer
ఐవీఆర్