పట్టపగలే యువతిని కొడవలితో నరికి చంపేసిన యువకుడు
కర్నాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఓ దారుణం జరిగింది. పట్టపగలే ఓ యువతిని కొడవలితో ప్రియుడు నరికి చంపేశాడు. కర్నాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల్ తాలూకాలోని బీసీ రోడ్ వద్ద ఉన్న కేఎస్‌ఆర్‌టీసీ బస్టాండ్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తున్న లావణ్య (21) అనే యువతి తన విధులు ముగించుకుని తిరిగి ఇంటికి బయల్దేరింది. ఆమెను వెంటాడి, బస్టాండ్‌లో చేతన్ (22) అనే యువకుడు అడ్డుకుని కొడవలితో ఆమెపై పలుమార్లు దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమె చనిపోయిందని నిర్ధారించుకని అక్కడ నుంచి పారిపోయాడు.
ఈ దారుణానికి పాల్పడిన నిందితుడు లావణ్య దూరపు బంధువు కావడం గమనార్హం. గత కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గారిస్తున్నారు.
