మంగళవారం, 21 ఏప్రియల్ 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 ఫిబ్రవరి 2026 (10:36 IST)

ప్రియుడి కళ్ల ముందే సామూహిక అత్యాచారం.. ఆపై డబ్బులు కూడా లాక్కెళ్లారు..

crime
మహిళలపై అకృత్యాలు రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతున్నాయి. ఎక్కడపడితే అక్కడ మహిళలపై వేధింపులు జరుగుతున్నాయి. తాజాగా అస్సాంలో మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుండగులు ఆమె వద్ద వున్న డబ్బును కూడా లాగేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. అస్సాంలోని కచార్ జిల్లా, సిల్చార్ పట్టణ సమీపంలోని బైపాస్ రోడ్డులో జరిగింది. 
 
బాధితురాలు తన ప్రియుడితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా, ఎస్‌యూవీలో వచ్చిన ఏడుగురు వ్యక్తులు వారిని అడ్డగించారు. అనంతరం యువకుడి ముందే ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

అంతటితో ఆగకుండా, బాధితురాలిని బెదిరించి, ఆమె ద్వారా ఆన్‌లైన్‌లో తమ ఖాతాకు రూ.10,000 బదిలీ చేయించుకున్నారు. ఈ ఘటనపై బాధితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.