సంబంధిత వార్తలు
- ఏపీలో వున్న ప్రజలంతా ఉచిత పథకాలతో పనిలేకుండా కుబేరులవుతారు, ఎలాగంటే?
- Free schemes: ఉచిత పథకాలను ఎత్తేస్తేనే మంచిదా? ఆ ధైర్యం వుందా?
- 2026లో AI వెన్నుపోటు పొడిచే ఉద్యోగాల జాబితాలో నా ఉద్యోగం ఉందా?
- ఆపరేషన్ చేసి సర్జికల్ బ్లేడ్‌ను మహిళ కడపులో వదేలేశారు...
- బలమైన మిత్రుడు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భారత ప్రధాని మోడి, కీలక ఒప్పందాలు
వెనిజులా వెన్ను విరిచిన ఉచిత పథకాలు, ప్రజలకు ఉచితాలు ఇచ్చి సర్వనాశనం
కర్టెసీ: జెమినీ ఏఐ ఫోటో
తను గద్దెనెక్కితో ప్రజలకు ఉచిత పథకాలు అమలుచేస్తానంటూ తాయిలాలు రుచి చూపించాడు చావెజ్ అనే వ్యక్తి. విద్య, వైద్యం, తిండి.. ఇలా అనేక విభాగాల్లో ఉచితాలను అందిస్తానని చెప్పడంతో ప్రజలు ఆయన వైపు మొగ్గారు. చావెజ్ అధ్యక్షుడయ్యాక ఆయన ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు విద్య, వైద్యం, గ్యాస్ ఇంకా ఇత్యాది వసతులన్నీ ఫ్రీగా ఇచ్చేయడం ప్రారంభించాడు.
అణుబాంబు కంటే శక్తివంతమైన ఉచితాల బాంబుతో సర్వనాశనం
ఈ ఉచితాల కారణంగా క్రమంగా వెనెజులా సంపద కొండ క్రమంగా కరిగిపోవడం ప్రారంభించింది. కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే... అనే సామెతలా ఉచిత పథకాలను అమలు చేస్తూ ప్రజలను సోమరులను చేయడంతో పరిస్థితి చేయిదాటి పోయింది. దాంతో విపరీతంగా అప్పులు చేసాడు. అది చాలదన్నట్లు ప్రమాదకరమైన పద్ధతి పాటించాడు. ఇబ్బడిముబ్బడిగా కరెన్సీని ముద్రించేసాడు. ఇన్ని అవలక్షణాలు వుంటే ఇక ఏ దేశమైనా ఎలా బాగుపడుతుంది. ఆర్థిక పతనం దిశగా పయనించింది. ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయి. కనీసం 70 లక్షల మంది దేశంలో బ్రతలేక దేశం విడిచి వెళ్లిపోయారు.
ఉచిత పథకాలతో బికారి
ఉచితాలు అంటూ అధ్యక్షుడు ఛావెజ్ తీసుకున్న తెలివితక్కువ నిర్ణయానికి ఎంతోమంది ధనవంతులను బికారులను చేసింది. దేశంలో ఎంతోమంది వ్యవసాయ భూములను జాతీయం చేసారు. బ్యాంకింగ్, సిమెంట్, చమురు, తయారీ రంగంలోని కంపెనీలన్నింటిని జాతీయం చేసాడు. దాంతో దేశంలోని ప్రైవేటు కంపెనీలన్నీ దాదాపు మూతపడిపోయాయి. డిమాండ్-సప్లై మధ్య తీవ్ర అంతరం ఏర్పడింది. ధరలు ఒక్కసారిగా 50 శాతం మేర పెరిగిపోయాయి. దాంతో పూర్తిగా బికారిగా మారిపోయింది వెనెజులా. ఆ దేశానికి ఛావెజ్ అనే వ్యక్తి అధ్యక్షుడు కావడమే ఆ దేశానికి శాపంగా మారింది. అతడు తీసుకున్న ఆర్థిక విధానాలు వెనెజులాను ఆర్థికపరంగా కోలుకోలేని దెబ్బ తీసింది.
మదురో వచ్చినా మారని పరిస్థితి
చావెజ్ తర్వాత అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన మదురో వచ్చినా పరిస్థితి మారలేదు. 2017 చివరి నాటికి వెనిజులా ఆర్థిక వ్యవస్థ 61 శాతం మేర కుంచించుకుపోయింది. దాంతో దేశంలో బ్రతకలేక ప్రజలు కొలంబియా, చిలీ, పెరూ, అమెరికా వలస వెళ్లిపోయారు. ఎలాంటి యుద్ధం, విప్లవాలు వంటివేమీ లేకుండా చరిత్రలో అతిపెద్ద ఆర్థిక సంక్షోభంలో పడిన దేశంగా వెనిజులా చరిత్రకెక్కింది.
మీడియా గొంతు నొక్కేసారు
దేశంలోని దారుణమైన స్థితిగతులను వివరిస్తున్న మీడియా గొంతు నొక్కేసారు. ప్రపంచానికి వాస్తవాలు తెలియకుండా వుండేందుకు ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు. తమ విధానాలను సమర్థించనివారిపై కఠిన చర్యలకు ఉపక్రమించారు. మొత్తంగా ఎన్నికల అధికారం, సైన్యం నుంచి మీడియా వరకూ అంతా స్వాధీనం చేసుకున్నారు. పూర్తి నిరంకుశంగా మారిపోయారు. వారికి చెప్పేవారే లేకుండా పోయిన పరిస్థితి తలెత్తింది. మొత్తమ్మీద ప్రజలకు ఉచిత పథకాలు అందించి వెనిజులా దేశాన్ని సర్వనాశనం చేసిన అధ్యక్షులుగా చావెజ్, మదురో చరిత్రలో నిలిచిపోయారు.
ప్రస్తుతం వెనిజులా దేశాన్ని ఆర్థికంగా గట్టునపడేయాలంటే అదంత సాధ్యమయ్యే పనికాదు. అణుబాంబు కంటే శక్తివంతమైన ఉచితాల బాంబు ప్రభావంతో వెనిజులా ప్రస్తుతం కొట్టుమిట్టాడుతోంది. ఈ సంక్షోభం నుంచి ఎప్పటికి కోలుకుంటుందో తెలియని పరిస్థితి. వెనిజులా ఇంతటి దయనీయ స్థితికి చేరుకోవడానికి వెనుక ఉచిత పథకాలే. కనుక వాటిని ఏ ప్రభుత్వం అయినా సాధ్యమైనంత తగ్గించుకుంటేనే మనుగడ అన్నది దీన్నిబట్టి అర్థమవుతుంది.
