1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
  4. Is my job on the list of jobs that AI will eliminate in 2026?

2026లో AI వెన్నుపోటు పొడిచే ఉద్యోగాల జాబితాలో నా ఉద్యోగం ఉందా?

AI Jobs
కర్టెసీ: జెమినీ ఏఐ ఫోటో
AI ఎంతటి విప్లవం సృష్టిస్తుందో అంతా చూస్తూనే వున్నాము. ఐతే అంతకంటే ఎక్కువగా ఎంతోమంది ఉపాధిని లాక్కెళ్లిపోతోంది. నిరుద్యోగులను చేసి రోడ్లపైకి విసిరేస్తుంది. ఎన్నో ఆశలతో ఐటీ పరిశ్రమలో ఉద్యాగాలు వస్తాయన్న యువతకు తీవ్ర నిరాశను కలిగిస్తోంది. మొత్తంగా ఏఐతో ఎన్నో విభాగాలలో పనిచేసేవారి ఉద్యోగాలు రోజుల వ్యవధుల్లో ఊడిపోతున్నాయి. తాజాగా మైక్రోసాఫ్ట్ మరో బాంబ్ పేల్చింది. గాడ్ ఫాదర్ ఆఫ్ జెఫ్రీ హింటన్ 2026లో భారీ లేఆఫ్స్ జరుగుతాయని పేర్కొన్నారు. ఆ ప్రకారంగా మైక్రోసాఫ్ట్ లిస్ట్ చేసిన 40 జాబ్స్‌తో ఇక భవిష్యత్తులో అవసరం వుండదని చెప్పేసారు. ఆ ప్రకారంగా ఈ 40 ఉద్యోగాల్లో పనిచేసేవారిని AI ఒకరకంగా వెన్నుపోటు పొడుస్తుందన్నమాట. ఇంతకీ ఈ 40 ఉద్యోగాలు ఏమిటి? తెలుసుకుందాము రండి.
 
ఉద్యోగాలు కోల్పోయే రంగాల్లో వుండేవారి జాబితా ఇదే...
రచయితలు
సంపాదకులు
వ్యాఖ్యాతలు
అనువాదకులు
చరిత్రకారులు
రాజకీయ శాస్త్రవేత్తలు
వార్తా విశ్లేషకులు
డేటా శాస్త్రవేత్తలు
మార్కెట్ పరిశోధన విశ్లేషకులు
PR నిపుణులు
టెలిమార్కెటర్లు
టికెట్ ఏజెంట్లు
టెలిఫోన్ ఆపరేటర్లు
కస్టమర్ సర్వీస్ ప్రతినిధులు
వెబ్ డెవలపర్లు
గణిత శాస్త్రవేత్తలు
జర్నలిస్టులు
కంటెంట్ ప్రొవైడర్స్
 
ఇలా ఎన్నో వైట్ కాలర్ ఉద్యోగాలను AI కబళించబోతోంది. నా ఉద్యోగం ఎలా పోతుందని అనుకోవచ్చు. సింపుల్.. ఎలాగంటే... మీ ఉద్యోగంలో మీరు కంటెంట్‌ను రూపొందించడం అనుకోండి, దాన్ని AI ఇప్పటికే దానిలోని భాగాలను మీకంటే వేగంగా చేయగలదు. మీ ఉద్యోగంలో కస్టమర్ వేసే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ఉంటే AI దానిని కూడా ఆటోమేట్ చేయగలదు. మీరు చేసే గంటల పనిని కేవలం సెకన్ల వ్యవధిలో చేసేస్తుంది. కనుక ఈ మార్పు ఇకపై భవిష్యత్తుకు సంబంధించినది కాదు. ఇది ఇప్పుడు జరుగుతోంది.
 
కానీ మైక్రోసాఫ్ట్ అసలు మనుషులు చేసే ఉద్యోగాలు అదృశ్యమవుతాయని చెప్పలేదు. ఉద్యోగాలలో పని నాటకీయంగా మారుతుందని చెప్పింది. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే... AI అనేది ఉద్యోగాలను నాశనం చేయదు. నిరుపయోగం కావడాన్ని ఇది నాశనం చేస్తుంది. 2026లో ఉద్యోగాలలో వుండేవారు ఎలాంటివారంటే... AIని ప్రతిఘటించేవారు కాదు దానితో పోటీ పడకుండా దానితో కలిసి పనిచేయడం నేర్చుకున్నవారుగా వుంటారు.
 
AI వెన్నుపోటు పొడిచే ఉద్యోగాల జాబితాలో నా ఉద్యోగం ఉందా? అని ఆలోచించుకుంటే... 2026లో మీరు మీ నైపుణ్యాన్ని ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్లే స్థితిలో వున్నారా అన్నదే ప్రశ్న. దీనికి సమాధానం ఏమిటంటే... క్రమేణా పరిణామం చెందే కెరీర్లు మాత్రమే భవిష్యత్తులో మనుగడను సాగిస్తాయి. స్థిరంగా నిలిచిపోయే కెరీర్లు ఇబ్బందులు పడతాయి. AI అనేది మనం కోరుకోని ఒక కొత్త సహోద్యోగి. కనుక దానితో ఎలా కలిసి పనిచేయాలన్నదే పెద్ద సవాల్. ఆ సవాల్ అధిగమించినవారికి AI ది బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది.
About Writer
ఐవీఆర్
తర్వాతి కథనం
బ్రహ్మదేవుడి కంటే నాకే ఎక్కువ తెలుసు, నేను చెప్పింది వినిసావు: యువతితో వీడియోలో అన్వేష్